క్రీడాభూమి
రంజీ ఫైనల్‌కు బెంగాల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోల్‌కతా, మార్చి 3: ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్నాటకను 174 పరుగుల తేడాతో చిత్తుచేసిన బెంగాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2006-07 సీజన్ తర్వాత ఈ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. బెంగాల్‌ను ఓడించడానికి 352 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నాటక మూడో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 98 పరుగులు సాధించింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజైన మంగళవారం ఉదయం ఆటను కొనసాగించి, 55.3 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. చివరికి కృష్ణప్ప గౌతం 22, అభిమన్యు మి థున్ 38 పరుగులతో జట్టుదు ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బెంగాల్ బౌలర్ ముఖేష్ కుమార్ 61 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి, కర్నాటక పరాజయాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో రాణించిన అనుస్తుప్ మజుందార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు..
బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 92 ఓవర్లలో 312 ఆలౌట్ (అనుస్తుప్ మజుందార్ 149 నాటౌట్, షాబాజ్ అహ్మద్ 35, ఆకాశ్ దీప్ 44, అభిమన్యు మిథున్ 3/77, ప్రసిద్థ్ కృష్ణ 2/78, రోనిత్ మోరె 3/52, కృష్ణప్ప గౌతం 2/90).
కర్నాటక మొదటి ఇన్నింగ్స్: 36.2 ఓవర్లలో 122 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 26, కృష్ణప్ప గౌతం 31, అభిమన్యు మిథున్ 24, ఇషాన్ పొరెల్ 5/39, ఆకాశ్ దీప్ 3/30, ముఖేష్ కుమార్ 2/46).
బెంగాల్ రెండో ఇన్నింగ్స్ (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 190): 54.4 ఓవర్లలో 161 ఆలౌట్ (సందీప్ చటర్జీ 45, అనుస్తుప్ మజుందార్ 41, షాబాజ్ అహ్మద్ 31, అభిమన్యు మిథున్ 4/23, కృష్ణప్ప గౌతం 3/15, రోనిత్ మోరే 2/56).
కర్నాటక రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 252): 55.3 ఓవర్లలో 177 ఆలౌట్ (రవికుమార్ సమర్థ్ 27, దేవదూత్ పడిక్కల్ 62, కృష్ణప్ప గౌతం 33, అభిమన్యు మిథున్ 38, ఇషాన్ పొరెల్ 2/58, ముఖేష్ కుమార్ 6/61, ఆకాశ్ దీప్ 2/44).
*చిత్రం...ఆరు వికెట్లు పడగొట్టిన ముఖేష్ కుమార్‌ను భుజాలపైకి ఎక్కించుకున్న బెంగాల్ బౌలర్ ఆకాశ్ దీప్