క్రీడాభూమి
ప్రీ క్వార్టర్స్‌కు సోలంకీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 March 2020
అమ్మాన్ (జోర్డాన్), మార్చి 3: భారత బాక్సర్, కామనె్వల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత గౌరవ్ సోలంకీ ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ పురుషుల 57 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్ ఫైన ల్స్ చేరాడు. మంగళవారం నాటి మొదటి రౌండ్‌లో అతను కిర్గిస్తాన్ కు చెందిన అకిల్బెక్ ఎసెనె్బక్ ఉలూ ను 5-0 తేడాతో చిత్తుచేశాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో 52 కిలోల విభాగం లో పోటీపడి, టైటిల్ సాధించిన అతను ఒలింపిక్స్‌లో 57 కిలోల వి భాగంలో పోటీ పడేందుకు అర్హత కోసం శ్రమిస్తున్నాడు. మొదటి రౌం డ్‌లో అతను తన ప్రత్యర్థి ఉలూపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. బలమైన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. సోలంకీ విజృంభణకు అడ్డుకట్ట వేయలేకపోయిన ఉలూ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.