క్రీడాభూమి

ఐపీఎల్‌పై మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కోట్లకు కోట్లు సంపాదించిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహణపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) మల్లగుల్లాలు పడుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ శనివారం భేటీ అయింది. సమావేశంలో చర్చించిన అంశాలు, ఇతరత్రా వివరాలు ఇవ్వకుండా బీసీసీఐ గోప్యతను పాటించింది. అయితే, నిడివి తగ్గించి, తక్కువ రోజుల్లో మినీ టోర్నీని పూర్తి చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, మినీ టోర్నమెంట్‌ను నిర్వహించడంసహా మొత్తం ఏడు అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్ పోటీలను నిర్వహించాలన్నది రెండో అంశమని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. అంటే నాలుగు జట్లు నాకౌట్ లేదా సెమీ ఫైనల్స్‌కు చేరతాయి. సదరు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మూడో ఆప్షన్‌గా వారాంతంలోని రెండు రోజుల్లో మాత్రమే మ్యాచ్‌లను నిర్వహించడాన్ని చర్చించారు. రెండు లేదా మూడు కేంద్రాలను ఎంపిక చేసి, వాటిలో మాత్రమే మ్యాచ్‌లను జరపడం నాలుగో ఆప్షన్. ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ప్రయాణాలపై ప్రభుత్వం విధించిన నిబంధలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని చర్చించారు. ఆరో ప్రత్యామ్నాయంగా, ఐపీఎల్ టోర్నీలోని 60 మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా, ఖాళీ స్టేడియాల్లో ఆడించే అంశాన్ని పరిశీలిస్తారు. చివరి ఆప్షన్ కరోనా వైరస్ ఉధృతి పూర్తిగా తగ్గే వరకూ వేచిచూడడం.
విదేశాల్లో టోర్నీ ఉండదు..
దేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్న కారణంగా, విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలు ఉంటాయని వచ్చిన ఊహాగానాలను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ యజమాని నెస్ వాడియా అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి జై షా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్, ముంబయి ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ, ఢిల్లీ కేపిటల్స్ ఓనర్ పార్థ్ జిందాల్ కూడా హాజరైన ఈ సమావేశం అనంతరం వాడియా విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 29 నుంచి మే 24వ తేదీ వరకు జరగాల్సిన ఐపీఎల్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఎవరికీ అవగాహన లేదని అన్నాడు. రెండుమూడు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని, అప్పుడు ఏదో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నాడు. ఆ సమయానికి కరోనా వైరస్‌కు తెరపడవచ్చని ధీమా వ్యక్తం చేశాడు. డబ్బు కంటే ఆటగాళ్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని వాడియా స్పష్టం చేశాడు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ఎలాంటి నిర్ణయాలకైనా సిద్ధంగా ఉండాలని సమావేశంలో అందరూ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపాడు. పరిస్థితి మెరుగుపడుందని తామంతా ఆశిస్తున్నట్టు చెప్పాడు. విదేశీ ఆటగాళ్లు ఈసారి ఐపీఎల్‌లో ఆడతారా? అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. కాగా, త్వరలోనే మరో సమావేశం ఉంటుందని, అప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని ఢిల్లీ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. ఆ సమావేశంలోనూ విధివిధానాలకు రూపకల్పన జరుగుతుందని చెప్పాడు.

*చిత్రాలు.. ముంబయిలో శనివారం జరిగిన సమావేశానికి హాజరైన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి జై షా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్, ముంబయ ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ