క్రీడాభూమి

వాయిదాల పరంపర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 14: కరోనా వైరస్ వ్యాప్తి, తత్ఫలితంగా వివిధ దేశాలు చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా మిగతా రంగాలతోపాటు క్రీడా రంగం కూడా కుదేలవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇప్పటికే వచ్చేనెల 15వ తేదీ వరకూ వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తాజాగా దేశవాళీ పోటీలన్నింటినీ నిరవధికంగా వాయిదా వేసింది. రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర, రెస్ట్ఫా ఇండియా మధ్య జరగాల్సిన ఇరాన్ కప్ మ్యాచ్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇరానీ కప్‌తోపాటు, విజ్జీ ట్రోఫీ, సీనియర్ మహిళల వనే్డ నాకౌట్, సీనియర్ మహిళల వనే్డ చాలెంజర్ తదితర టోర్నీలను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అండర్-19 వనే్డ నాకౌట్, అండర్-19 టీ-20 లీగ్, సూపర్ లీగ్ అండ్ నాకౌట్, అండర్-19 టీ-20 చాలెంజర్ ట్రోఫీ, అండర్-23 నాకౌట్, అండర్-23 వనే్డ చాలెంజర్ వంటి దేశవాళీ టోర్నీలు కూడా రద్దయ్యాయి.
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అన్ని టోర్నీలను ఈనెల 31వ తేదీ వరకూ వాయిదా వేసింది. ఆతర్వాతే వాటి షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని ప్రకటించింది. హీరో ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, హీరో యూత్ లీగ్స్, గోల్డెన్ బేబీ లీగ్స్‌తోపాటు జాతీయ స్థాయి పోటీలు కూడా రద్దయినట్టు తెలిపింది.