క్రీడాభూమి

పీఎస్‌ఎల్ ‘నాకౌట్’ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 17: పాకిస్తాన్ సూపర్ లీగ్ నాకౌట్ దశ పోటీలు వాయిదా పడ్డాయి. ఒక విదేశీ ఆటగాడికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. అయితే, ఆ విదేశీ ఆటగాడు ఎవరన్నది వెల్లడించలేదు. కానీ, పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ రమీజ్ రాజా మాత్రం ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హాలెస్ పేరును ప్రకటించాడు. అతనికి కరోనా వైరస్ సోకినట్టు తనకు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించాడు. మొత్తం ఆరు జట్లు ఢీకొంటున్న ఈ టోర్నమెంట్ ఇప్పుడు నాకౌట్ దశకు చేరుకుంది. నాలుగు జట్లు సెమీస్‌కు దూసుకెళ్లగా, రెండు జట్టు ఇంటిదారి పట్టాయి. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మొదటి సెమీ ఫైనల్ మంగళవారం, తుది పోరు బుధవారం జరగాల్సి ఉంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా, లీగ్ దశలో చాలా మ్యాచ్‌లను పీసీబీ అధికారులు ప్రేక్షకులు ఎవరు లేని ఖాళీ స్టేడియాల్లో ఆడించారు. భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్న పీసీబీ ఇప్పుడు ఖాళీ స్టేడియాల్లో పీఎస్‌ఎల్‌ను నిర్వహించి మరింతగా నష్టపోయింది. కనీసం రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్ ద్వారా కొంత వరకైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావిస్తున్నది. ఒక విదేశీ ఆటగాడికి కరోనా వైరస్ సోకిందన్న వార్త పీసీమీ అధికారులకు ఒరటనిస్తున్నది. ఈ వార్తను వైద్య బృందం ధ్రువీకరించిన వెంటనే, పీఎస్‌ఎల్ నాకౌట్ మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక విదేశీ ఆటగాడు తనకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని పేర్కొంటూ, స్వదేశానికి వెళ్లిపోయాడని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఈ వార్త వెలువడిన వెంటనే, పీఎస్‌ఎల్ నాకౌట్ మ్యాచ్‌లను వాయిది వేసినట్టు తెలిపాడు. పీసీబీ పాలక మండలి ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించిందని పేర్కొన్నాడు. కాగా పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకూ కరోనా వైరస్ అనుమానిత ఆటగాడు అలెక్స్ హాలెక్స్ కావచ్చునని, ఈ విషయంలో తనకు మరింత స్పష్టత రావాల్సి ఉందని అన్నాడు. ఆయయ
ముల్తాన్ సుల్తాన్స్ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొగా, మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మొత్తం 14 పాయింట్లతో ఈ జట్టు అగ్రస్థానాన్ని ఆక్రమించింది. కరాచీ కింగ్స్ జట్టు 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలను నమోదు చేసింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. మొత్తం 11 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. లాహోర్ కలందర్స్ ఐదు విజయాలను సాధించగా, మరో ఐదింటిని చేజార్చుకుంది. పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పెషావర్ జల్మీ నాలుగు విజయాలు సాధించంది. ఐదు పరాజయాలను చవిచూసింది. ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు. మొత్తం తొమ్మిది పాయింట్లతో ఈ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్ సరసన నిలిచింది. ఆ జట్టు కూడా 10 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి, ఐదింటిని చేజార్చుకోగా, ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. రెండు జట్లు పాయింట్ల పరంగా సమవుజ్జీలుగానే నిలవగా, నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో పెషావర్ జల్మీ నాకౌట్ దశకు దూసుకెళ్లింది. క్వెట్టా గ్లాడియర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ (10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఆరు పరాజయాలు. ఒక మ్యాచ్ రద్దు. మొత్తం 7 పాయింట్లు) టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మొదటి సెమీ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ జట్లు ఢీ కొంటాయి. రెండో సెమీ ఫైనల్ కరాచీ కింగ్స్, లాహోర్ కలందర్స్ మధ్య జరుగుతుంది. వాయిదా పడిన మ్యాచ్‌లను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది పీసీబీ ప్రకటించలేదు.