క్రీడాభూమి

ఐసీసీ టీ20 జట్టులో షెఫాలీ వర్మ, పూనమ్ యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, మార్చి 9: ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఐసీసీ టీ20 జట్టును ప్రకటించింది. అంతకుముం దు మహిళల ప్రపంచకప్ అంచనాలను మించి మంచి ఫలితాలు తీసుకురావడంపై ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. టోర్నీ ముగిశాక జట్టును ఎంపిక చేసింది.
ఐసీసీ ప్రకటించిన జట్టులో మొత్తం 12 మంది క్రీడా కారిణులు ఉండగా, ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు, ఇంగ్లాం డ్ నుంచి నలుగురు, భారత్ నుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికా నుంచి ఒకరిని తీసుకుం ది. జట్టుకు కెప్టెన్‌గా మెగ్ లానింగ్ (కెప్టెన్)కు వకాశం కల్పించింది. అయతే టీమిండియా యువ ప్లేయర్ షెఫాలీ వర్మను 12వ క్రికెటర్‌గా తీసుకోవడం విశేషం.
ఐసీసీ జట్టు: అలీసా హీలీ (ఆస్ట్రేలియా), బేత్ మూనీ (ఆస్ట్రేలియా), నటాలీ సీవర్ (ఇంగ్లాండ్), హెథర్ నైట్ (ఇంగ్లాండ్), మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), లారా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా), జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లాండ్), అన్యా షబ్‌స్రోల్ (ఇంగ్లాండ్), మెగాన్ షుట్ (ఆస్ట్రేలియా), పూనమ్ యాదవ్ ( భారత్), షెఫాలీ వర్మ ( భారత్).