క్రీడాభూమి

చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సునీల్ జోషీ ఎంపికయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సునీల్ జోషీ పేరును బీసీసీఐకి సిఫార్సు చేసింది. బుధవారం సమావేశమైన సీఏసీ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూలు చేసింది. వెంకటేశ్ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నా సీఏసీ సునీల్ జోషీ వైపే మొగ్గు చూపడంతో అతడినే చీఫ్ సెలక్టర్ పదవి వరించింది. సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేసర్ హర్వీందర్‌సింగ్‌కు సీఏసీ అవకాశం కల్పించింది. స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం నూతన చైర్మన్ ఆధ్వర్యంలోని కమిటీనే టీమిండియాను ఎంపిక చేయనుం ది. సెలక్టర్ ఎంపిక నేపథ్యంలో సీఏసీ మంగళవారమే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలను కలిసినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మరోసారి భేటీ అయన సీఏసీ అజిత్ అగార్కర్ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో కర్ణాటక మాజీ ఆటగాళ్లు వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషీల మధ్య పోటీ నెలకొంది. చివరికి జోషీనే సీఏసీ ఎంపిక చేసింది. సునీల్ జోషీ 1996-2001 మధ్య కాలంలో టీమిండియా తరఫున ప్రాతిని ధ్యం వహించాడు. మొత్తం 15 టెస్టులు , 69 వనే్డలు ఆడాడు.

*చిత్రం... సునీల్ జోషీ