క్రీడాభూమి

ప్రతీకారం తీర్చుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 4: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే సెమీ ఫైనల్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భార త్, బలమైన జట్టుతో తలపడనుండడంతో ఈ మ్యాచ్‌పై అంద రి దృష్టి పడింది. ఇంగ్లాండ్ సైతం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యా చ్ మినహా గ్రూప్ బీ నుంచి మిగతా అన్నింట్లోనూ విజయం సాధించింది. అయతే గత గణాంకాలు మాత్రం భార త్‌ను వెంటాడుతుండగా, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈ టోర్నీ ద్వారా లభించనుంది.
బ్యాట్స్‌మెన్లు రాణిస్తేనే..
భారత్ లీగ్ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచినా, అదంతా బౌలర్ల విజయమే. అన్నింట్లోనూ తక్కువ స్కోర్లే నమోదు చేసి నా బౌలర్లు రాణించడంతోనే సెమీస్ వరకు చేరింది. ఇప్పటి వరకు యువ క్రీడాకారిణి షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రీగ్స్ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లంతా నిరాశ పరిచారు. ముఖ్యంగా సీనియ ర్లు స్మృతీ మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకోదగిన స్కోర్లేమీ చేయలేదు. టాప్ ఆర్డర్‌లో వీరంతా రాణిస్తే, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, తాన్యా భాటియాలు మిడిలార్డర్‌లో రా ణించే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్‌లో పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండేలు తమ స్థాయలో రాణించి జట్టుకు విజయాలను అందించారు. నేడు జరిగే మ్యా చ్‌లోనూ జట్టు మొత్తం సమష్టిగా రాణిస్తే భారత్ తిరుగుండదు. దీంతో పాటు మూడేళ్ల క్రితం జరిగిన వనే్డ ప్రపంచకప్ ఫైనల్, రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఓటమికి ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం హర్మన్ సేనకు లభించనుంది.
షెఫాలీ సూపర్..
యువ క్రీడాకారిణి, ఓపెనర్ షెఫాలీ వర్మ ప్రపంచకప్ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో వరుసగా 39, 29, 46, 47 పరుగులతో 167 పరు గులు చేసి టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. అయతే షెఫాలీకి అండగా తగిన స్థాయలో స్మృతీ మంధాన రాణించకపోడం నిరాశ కలి గించే అంశమే. వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నా షెఫాలీ, సెమీ ఫైనల్‌లోనూ అలాగే రాణించాలని జట్టుతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.
టోర్నీ టాప్ స్కోరర్లు వారిద్దరే..
మరోవైపు ఇంగ్లీష్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన మిగతా అన్నింట్లోనూ తమ మార్క్ ప్రదర్శ న చేసింది. జట్టులో కెప్టెన్ హీథర్ నైట్, వ్యాట్ బీవౌంట్, స్కీవర్, అమీ జోన్స్ మంచి ఫాంలో ఉండడం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. అయతే ఈ టోర్నీలో స్కీవర్ 202 పరుగులతో టాప్‌లో కొనసాగు తుండగా, హీథర్ నైట్ 193 పరుగులతో రెండో స్థానంలో ఉంది. ఇక పేస్ విభాగంలోనూ ప్రత్యర్థి జట్టు బలంగానే కనిపిస్తోంది. నటలీ స్కీవర్‌తో పాటు అన్యా శ్రుభ్‌సోల్ మంచి ఫాంలో ఉన్నారు.
నాలుగింట్లో మాత్రమే..
ఇప్పటివరకు టీ20ల్లో ఇరుజట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ కేవలం నాలుగింట్లో మాత్రమే విజయం సాధించగా, ఇంగ్లాండ్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రపంచకప్ టోర్నీకి ముందు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లోనూ రెండు మ్యాచుల్లో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది.
రద్దయతే ఫైనల్‌కు..
నేడు జరిగే సెమీ ఫైనల్ వర్షం కారణంగా రద్దయతే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. గ్రూప్ మ్యాచుల్లో అన్నింటా విజయం సాధించి, పాయంట్ల పరంగా చూస్తే ప్రత్యర్థి జట్టు కంటే పటిష్ట స్థాయలో ఉండడమే ఇందుకు కారణం. ఇటీవల గ్రూప్ దశలో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయన విషయం తెలిసిందే. సిడ్నీలో ప్రస్తుతం భారీ వర్షాలు న్నాయని, నేడు జరిగే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారనుం దని, అక్కడి వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నేడు జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయ.
జట్ల అంచనా:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రీగ్స్, షెఫాలీ వర్మ, వేదా కృష్ణమూర్తి, తాన్యా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, అరుంధతీ రెడ్డి, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాయడ్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్.
ఇంగ్లాండ్: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బీవౌంట్, కెథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫీ ఎక్లెస్టోన్, జార్జియా ఎల్వీస్, సారా గ్లెన్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), నటలీ స్కీవర్, అన్యా శ్రుభ్‌సోల్, మెడి విల్లియర్స్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్‌ఫిల్డ్, డన్ని వ్యాట్.