క్రీడాభూమి
మెజీషియన్‌గా అయ్యర్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ కారణంగా ఎంతోమందికి ఊహించని విరామం లభించింది. ఎప్పుడూ ఏదో ఒక టోర్నీ లేదా సిరీస్‌లో ఆడుతూ తీరిక లేకుండా ఉండే క్రికెటర్లు కూడా కరోనా వైరస్ కారణంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ మెజీషియన్ అవతారం ఎత్తాడు. సామాజిక దూరం, దాని ఆవశ్యకత అనే అంశాన్ని ప్రజలకు వివరిస్తూనే పేక ముక్కలతో వివిధ మేజిక్కులు చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలన్నీ వాయిదా పడ్డాయి లేదా రద్దయ్యాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కూడా అన్ని స్థాయిల్లోనూ మ్యాచ్‌లను రద్దు చేసింది. కాగా, శనివారం అయ్యర్ మ్యాజిక్ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేస్తూ క్రికెటర్లంతా ఈ విరామ సమయాన్ని ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారని వ్యాఖ్యానించింది. మెజీషియన్‌గా ఇంటికి మాత్రమే తెలిసిన అయ్యర్ ఈ విరామ కారణంగా అందరికీ సుపరిచితుడయ్యాడని పేర్కొంది. ‘గన్ ట్రిక్’ పేరుతో అయ్యర్ చేసిన కొత్త మ్యాజిక్‌ను కూడా బీసీసీఐ ప్రస్తావించింది. క్రికెట్ క్యాలండర్ పూర్తిగా అస్తవ్యస్తమైన నేపథ్యంలో క్రికెటర్లంతా తమను తాము స్వీయ నిర్బంధం చేసుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేరువలోనే ఉన్నారు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, లక్నోలో జరగాల్సిన రెండో వనే్డ, అదేవిధంగా కోల్‌కతాలో జరగాల్సిన చివరి, మూడవ వనే్డలను బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ రద్దు కాకపోయినప్పటికీ ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జరిగాయి. ప్రేక్షకులను ఈ మ్యాచ్‌లకు అనుమతించలేదు. శ్రీలంక తన ఇంగ్లాండ్ పర్యటనను కుదించుకుంది. కోట్లాది రూపాయలను ఆర్జించిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదా పడింది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ ఈనెల 29న మొదలు కావాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కాగా, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లల్లోంచి బయటకు రావద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తుండడంతో క్రీడా పోటీలకు ఆస్కారం లేకుండా పోయింది.
*చిత్రం... భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్