క్రీడాభూమి

కరోనా ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్ ప్రభావం క్రీడా రంగాన్ని కూడా పట్టి పీడిస్తున్నది. వివిధ దేశాల్లో జరగాల్సిన ఎన్నో ప్రాంతీయ, అంతర్జాతీయ టోర్నీలు, క్వాలిఫయింగ్ ఈవెంట్లు, ఇతరత్రా పోటీలు రద్దవుతున్నాయి. సైప్రస్‌లోని నికొసియాలో మార్చి 4 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సిన షూటింగ్ వరల్డ్ కప్ నుంచి భారత్ వైదొలగింది. మరికొన్ని దేశాలు ఇలాంటి నిర్ణయానే్న తీసుకుంటే, ఆ టోర్నీ జరిగే అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయి. అంతేగాక, న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ కప్ సంయుక్త ఆతిథ్యం నేపథ్యంలో పోటీలను భారత జాతీయ షూటింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) నిర్వహించాలి. అది ఎంత వరకూ జరుగుతుందనేది అనుమానమే. కరోనా కారణంగా వాయిదా పడిన లేదా రద్దయిన టోర్నీల్లో జపాన్, ఇటలీలో జరగాల్సిన సాకర్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. పలు బాడ్మింటన్, ఆర్చరీ ఈవెంట్స్ సైతం వాయిదా పడ్డాయి. యూరోపా లీగ్ సాకర్ మ్యాచ్‌లుసహా పలు పోటీలను స్టేడియాల్లోకి ప్రేక్షకులను ఎవరినీ అనుమతించకుండా నిర్వహిస్తున్నారు. ఉహాన్‌లో జరగాల్సిన బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌ను జోర్డాన్‌కు తరలించారు. చైనాలోని ఉహాన్ నుంచి అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రబలిన విషయం తెలిసిందే. భారత్‌లో జరగాల్సిన షూటింగ్ వరల్డ్ కప్ నుంచి ఏడు దేశాలు ఇప్పటికే వైదొలిగాయి. చైనా, తైవాన్, హాంకాంగ్, మకావూ, ఉత్తర కొరియా, తుర్కిమెనిస్తాన్, బహ్రెయిన్ దేశాలు కరోనా వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యగా షూటింగ్ వరల్డ్ కప్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాయి. దీనితో ఈమెగా టోర్నీ జరగడం అనుమానంగా మారింది. ఇంతకు ముందు న్యూఢిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు చైనా రెజ్లర్లకు భారత్ వీసాను నిరాకరించింది. అక్కడి నుంచే కరోనా వైరస్ ప్రపంచమంతటా విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. సైప్రస్‌లో జరగాల్సిన షూటింగ్ వరల్డ్ కప్‌లో మానవ్‌జిత్ సింగ్ సంధూ, శ్రేయాసీ సింగ్, లక్ష్యయ్ షెరాన్, అగత్ వీర్ సింగ్ బాజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్ వంటి మేటి షూటర్లు పోటీ పడాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వ సూచనతో భారత్ ఈటోర్నీ నుంచి వైదొలగింది. మొత్తం మీద ఎన్నో టోర్నమెంట్లు, క్వాలిఫయర్లు, ఇతరత్రా ఈవెంట్లును కరోనా వైరస్ భయం వెంటాడుతున్నది. ఈ ఏడాది చాలా పోటీలు వాయిదా పఢడం లేదా రద్దు కావడం తప్పదు.