ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 18: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 4న ప్రథమ సంవత్సరం పరీక్షతో ప్రారంభమై బుధవారం ద్వితీయ సంవత్సరం పరీక్షతో ముగిశాయి. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చివరిరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా అధికారులు కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం సెట్ నెంబర్-2ను అధికారులు ఉదయం ఎంపిక చేశారు. బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు రాష్టవ్య్రాప్తంగా 4,50121 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,37787 మంది మాత్రమే హాజరయ్యారు. 12,334 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతోపాటు రాష్టవ్య్రాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను పట్టుకున్న అధికారులు వారిని డీబార్ చేశారు. ఈ పరీక్షలపై కరోనా వైరస్ ప్రభావం కాస్త కనిపించినప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తిచేశారు.