ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ మొదటి నుంచా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: స్థానిక ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుందని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక సాధారణ పరిస్థితుల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని వారంటున్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎన్నికల నియమావళి అమలును రద్దు చేసిందని వారంటున్నారు. అంతేగాక ఎన్నికల నిర్వహణకు ముందు నాలుగు వారాలు ఎన్నికల నియమావళి అమలులో ఉండేలా చూడాలని సూచించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ దీనికి బలం చేకూరుస్తుందని వారంటున్నారు.రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర బలగాలు అవసరమని, లేదంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఆ లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంతేగాక రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలను కేంద్రానికి గుర్తుచేయడం గమనార్హమని వారు వెల్లడిస్తున్నారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన కోరడం పరిశీలించాల్సిన అంశమని వారంటున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఘర్షణలు, ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు చేయకుండా ఆటంకం కల్పించారని కమిషన్‌కు పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో న్యాయస్థానాలు కూడా కమిషనర్ రమేష్‌కుమార్‌కు అనుకూలంగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.