ఆంధ్రప్రదేశ్‌

ఫలితాల కోసం ఎదురుచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 13: కర్నూలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఎక్కడి వరకు వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1243 మంది అనుమానితులకు సంబంధించి పరీక్షలు నిర్వహించగా వారిలో 84 మందికి కరోనావ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది. వ్యాధి నిర్ధారణ కాని వారు 867 మంది ఉన్నారు. వీరిని ఇంకా క్వారంటైన్‌లోనే ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇక మొదటి దశలో అనుమానితులు, వారి కారణంగా మొదటి దశలో అనుమానితులు, వారి నుంచి అనుమానితులు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లలో 952 మంది వైద్యధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో ఇంకా 376 మందికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు రావాల్సి ఉంది. ప్రతి రోజు సుమారు 150 మంది అనుమానితుల నుంచి సేకరించిన స్వాప్‌ను అనంతపురం, తిరుపతిలో ఉన్న ల్యాబ్‌లకు పరీక్షల నిమిత్తం పంపుతున్నారు. ఇప్పటి వరకు 84 మందికి వ్యాధి నిర్ధారణ కాగా వారిలో అత్యధికంగా నంద్యాల నియోజకవర్గంలో 25 మంది, కర్నూలు నగరంలో 21 మంది ఉన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన నివాసం ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అంతేగాకుండా ఆయా ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాల్లో రసాయన ద్రవాలను చల్లుతూ కరోనా వైరస్‌ను అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ప్రజలను కరోనా వైరస్ బారి నుంచి తప్పించేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.
*చిత్రం...రెడ్‌జోన్ వద్ద పోలీసు బందోబస్తు