ఆంధ్రప్రదేశ్‌

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: శైలజానాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: స్థానిక ఎన్నికలు వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను వాయిదా కాదు, రద్దు కోరుతున్నామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరగని ఈ ఎన్నికలను పూర్తిగా రద్దుచేసి మళ్లీ తగిన సమయం ఇచ్చి ప్రజలకు రక్షణ కల్పించి నిర్వహించాలన్నారు. ఏకగ్రీవాలు, నామినేషన్లు కేవలం అధికార పార్టీ బెదిరింపులు, దాడులు వల్ల జరిగాయని, అందుకు తగిన సాక్ష్యాలు మీడియా ఇచ్చిందన్నారు. కేంద్రం ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేయడం సమంజసమేనన్నారు.
వాయిదాను సమర్థించడం హర్షణీయం:సీపీఐ

విజయవాడ, మార్చి 18: స్థానిక ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయించడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఓ ప్రకటనలో బుధవారం హర్షం వ్యక్తం చేశారు. కరోనా ప్రమాదాన్ని గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ తీర్పు చెప్పటం హర్షణీయమన్నారు. స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు వంటి అక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయకుండా వైసీపీ అడ్డుకుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచాలని కూడా డిమాండ్ చేశారు.
ఈసీని స్వతంత్ర వ్యవస్థగా గుర్తించాలి: నారాయణ

విజయవాడ, మార్చి 18: ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే అమలుచేయాలి తప్ప దానికి ఆటంకపరచరాదని చెప్పిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదుకాబట్టి ఎన్నికల కోడ్‌ను సడలించి కొత్త పథకాలను ప్రకటించకుండా పాత పథకాలను కొనసాగించటానికి అనుమతించిందని, ఇది మంచి పరిణామమన్నారు. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ అని, కేంద్ర ఎన్నికల కమిషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవటానికి వీలులేదన్నారు. ముఖ్యమంత్రిని నేనా, లేక ఎన్నికల కమిషనా అని ప్రశ్నిస్తున్నారని, అంటే ఎన్నికల కమిషన్ పరిధి, ముఖ్యమంత్రి హక్కులు తెలుసుకోలేని దీనస్థితిలో ముఖ్యమంత్రి ఉండటం విచారకరమని నారాయణ వ్యాఖ్యానించారు.