S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/18/2020 - 06:19

గుంటూరు, మార్చి 17: ముఖ్యమంత్రి జగన్‌కు గానీ, వైసీపీ నేతలకు గానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై గౌరవం లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/18/2020 - 06:18

గుంటూరు, మార్చి 17: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కప్పగంతు శివరామశర్మను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బెదిరించడం ఆయన అహంకారానికి నిదర్శనమని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య ఖండించారు.

03/18/2020 - 06:17

విజయవాడ, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని, తెలంగాణ రాష్ట్రం తరహాలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఆర్‌పీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

03/18/2020 - 06:17

గుంటూరు, మార్చి 17: రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను అవమానపరిచి, కించపరిచేలా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సీఎం కులాలను అంటగట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

03/18/2020 - 06:16

విజయవాడ, మార్చి 17: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో స్థానిక సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు అన్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కునేందుకు వ్యక్తిగత సంరక్షణ, పరిశుభ్రతతో పాటు వైరస్ గురించి అవగాహన అవసరమని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

03/18/2020 - 06:15

విజయవాడ, మార్చి 17: రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ, రవాణా, పంచాయతీరాజ్, పురపాలక, హోం, రెవెన్యూ, యువజన, ఆర్థిక శాఖల కార్యదర్శులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్‌లో భారీ మార్పులు

03/18/2020 - 01:09

నల్లమాడ, మార్చి 17: ఇటుకలు మోసే రామక్క, నిర్మాణం పనులు చేసే మేస్ర్తి ఓబుళేసు, రోడ్లు ఊడ్చే సాలెమ్మ, సోడా అమ్మే రాములు, కొబ్బరి బోండాం అమ్మే హనుమంతు, బట్టలు కుట్టే నసీమా, రాళ్లు కొట్టే చంద్ర, హోటల్‌లో టీ అందించే బా షా ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ... బెంగళూరు మహానగరంలో ఎక్కడ చూసినా రాయలసీమ వాసులు ముఖ్యం గా అనంతపురం జిల్లా వాసులే కనిపిస్తుంటారు.

03/18/2020 - 01:05

అమరావతి: కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్నిరకాలా సిద్ధం గా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అంటువ్యాధుల చట్టం-1897లోని 2, 3, 4 సెక్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రాంతానికైనా రాకపోకల్ని నియంత్రించేందుకు కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అధికారం ఉంటుందన్నారు.

03/18/2020 - 01:03

విజయవాడ (సిటీ): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన టీడీపీ నాయకులు కరోనా బూచిని చూపించి ఎన్నికలు వాయిదా వేయించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరోనా వైరస్ అంటున్న పచ్చపార్టీ నేతలు మాత్రం బాగానే తిరుగుతున్నారని మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పెళ్లిళ్లు,

03/18/2020 - 01:00

అమరావతి, మార్చి 17: కాలుష్య నివారణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలు, ఆసుపత్రులు సహా వివిధ సంస్థలు, వ్యవస్థల నుంచి కాలుష్య కారకాలపై సమాచారాన్ని కార్పొరేషన్ సేకరిస్తుంది. వీటివల్ల పర్యావరణానికి ఎలాం టి హాని జరక్కుండా ప్రాసెసింగ్, ట్రీట్‌మెంట్ కార్యక్రమం నిర్వహిస్తుంది.

Pages