ఆంధ్రప్రదేశ్
కరోనాను ఎదుర్కొనేందుకు ‘స్థానిక’ ప్రతినిధులే సమర్థులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, మార్చి 17: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో స్థానిక సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు అన్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కునేందుకు వ్యక్తిగత సంరక్షణ, పరిశుభ్రతతో పాటు వైరస్ గురించి అవగాహన అవసరమని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసుల గుర్తింపు, స్వీయ గృహ నిర్బంధం, గ్రామాల్లో అవగాహన కల్పించచడంలో అధికారులకు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు సహకరిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పరిధిలో నివసించే ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకునే స్థాయిలో ఉంటారని గుర్తుచేశారు. అధికారులు, ప్రజల మధ్య వారధిగా పనిచేస్తారని తెలిపారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ కరోనా వైరస్‌ను నియంత్రించే ప్రభావవంతమైన వ్యవస్థగా పనిచేస్తుందన్న అభిప్రాయాన్ని మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తం చేశారు.