ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల సంఘంపై గౌరవం లేని వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 17: ముఖ్యమంత్రి జగన్‌కు గానీ, వైసీపీ నేతలకు గానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై గౌరవం లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎస్, కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, ఇతర అధికారులంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, కానీ అధికారులు అలా వ్యవహరించడం లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై పలుమార్లు తాము అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కరోనాని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేస్తే తప్పుపడుతూ వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.