ఆంధ్రప్రదేశ్‌

కోవిడ్-19 నియంత్రణకు సమన్వయ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ, రవాణా, పంచాయతీరాజ్, పురపాలక, హోం, రెవెన్యూ, యువజన, ఆర్థిక శాఖల కార్యదర్శులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్‌లో భారీ మార్పులు
వేర్వేరు కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెలాఖరులో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తూ పూర్తి అదనపు ఇన్‌చార్జి సెక్రటరీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు మంగళవారం రీషెడ్యూల్ జారీ చేశారు.
ఈ నెల 21, 22 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోస్టుల భర్తీ పరీక్ష ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరుగుతుంది. నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి 27, 29 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ టెక్నికల్ అసిస్టెంట్ల పరీక్ష మే 18, 20న, ఈ నెల 28న జరగాల్సిన గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ (హైడ్రాలజీ), సైనిక్ వెల్ఫేర్ శాఖలో వెల్ఫేర్ ఆర్గనైజర్, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్స్, పురావస్తు, మ్యూజియం శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించిన పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుతుంది. ఈ నెల 29న జరగాల్సిన భూగర్భ గనుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్స్, సర్వేలాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పోస్టుల పరీక్ష మే 20న జరగనున్నాయి.
డిగ్రీ కళాశాలల్లో 25 కొత్త కోర్సులు
రాష్ట్రంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన 25 కొత్త కోర్సులను ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా, కొత్త నియామకాలు లేకుండా కేటాయించిన బడ్జెట్ పరిధిలోనే వీటిని నిర్వహించాలని సూచించింది.
ఎనె్నస్సెస్ సవరించిన మాన్యువల్ వర్తింపు
కేంద్ర ప్రభుత్వం ఎనె్నస్సెస్‌కు సంబంధించి సవరించిన మాన్యువల్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం వర్సిటీల్లో 10వేల మంది ఎనె్నస్సెస్ వలంటీర్లు ఉంటే ఫుల్‌టైమ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ను, 10వేల మంది కంటే తక్కువ ఉంటే పార్ట్‌టైమ్ కోఆర్డినేటర్‌ను నియమించాల్సి ఉంటుంది. కోఆర్డినేటర్ నియామకానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
వేతన సవరణ సంఘం గడువు పొడిగింపు
ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగుల పే-స్ట్రక్చర్, ఇతర అంశాల అధ్యయన ప్రక్రియ ఇంకా పూర్తికాని నేపథ్యంలో 11వ వేతన సవరణ సంఘం గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ గడువును మార్చి 31వరకూ పొడిగించింది. కమిషనర్ అశుతోష్ మిశ్రా పదవీకాలాన్ని కూడా ఆమేరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.