ఆంధ్రప్రదేశ్‌

కాలుష్య నియంత్రణకు కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 17: కాలుష్య నివారణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలు, ఆసుపత్రులు సహా వివిధ సంస్థలు, వ్యవస్థల నుంచి కాలుష్య కారకాలపై సమాచారాన్ని కార్పొరేషన్ సేకరిస్తుంది. వీటివల్ల పర్యావరణానికి ఎలాం టి హాని జరక్కుండా ప్రాసెసింగ్, ట్రీట్‌మెంట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. కార్పొరేషన్ పనితీరు, విధివిధానాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో జరిగిన సమావేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కాలు ష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కాల్వలు, నదులు, సముద్రాల్లో కి కాలకూటంలా వ్యర్థాలు చేరుతుండటాన్ని నివారించాలని ఆదేశించారు. కాలుష్యాన్ని కలిగించే వివిధ వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్, ట్రీట్‌మెంట్ కోసం ఒక ప్రత్యే క వ్యవస్థ ఉండాలని, ఈ విధానం పరిశ్రమలకు మేలుచేస్తుందంటూ ఆమేరకు ప్రతిపాదనలు తయారుచేయాలని కూడా గతంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రతిపాదనలను అధికారులు సమర్పించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు, సలహాలిచ్చారు. కాలు ష్య నియంత్రణ కోసం ఏర్పాటవుతున్న కార్పొరేషన్
ఈ విధానాలను విధిగా అమలు చేయాలన్నారు. అత్యున్నత ప్రమాణాలు పాటించటమే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సముద్రాలు, నదులు, కాల్వలు, ఇలా అన్నీ కలుషితమవుతున్నాయని, ఎవరైనా ఏదైనా వాటిలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భావితరాలకు మంచి భవిష్యత్ ఉండదన్నారు. పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి వ్యర్థాలను సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేయటం, ట్రీట్‌మెంట్ చేయటం వంటి పనులను కార్పొరేషన్ నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఇసుక పాలసీలో భాగంగా అనుసరిస్తున్న విధానాల తరహాలోనే ఇదికూడా ఉండాలన్నారు. వ్యర్థాలను సేకరించే విధానం సమర్థవంతంగా ఉండాలని, దీనిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిజర్స్ రూపొందించుకోవాలని సూచించారు. ప్రమాణాలు పాటించే పరిశ్రమలను ఇబ్బంది పెట్టరాదన్నారు. అదేసమయంలో కాలుష్య నియంత్రణ పాటించకపోతే చర్యలు తప్పవనే సంకేతాలు అందించాలన్నారు. ఎవరెవరు ఏయే ప్రమాణాలు పాటించాలనే విషయాలను సూచించే బోర్డులు కూడా సంబంధిత పరిశ్రమల్లో, వ్యవస్థల వద్ద ఉంచాలని ఆదేశించారు. అలాగే విజిల్ బ్లోయర్స్‌ను ప్రోత్సహించాలన్నారు. కాలుష్యం కాటుపై ఎవరైనా సమాచారం అందించేలా చూడాలన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచాలని, వారికి బహుమతులు కూడా అందించాలని స్పష్టం చేశారు.
మున్సిపాల్టీలు, పట్టణాల్లో కాలుష్య నివారణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సీఎం సూచించారు. సచివాలయాలను సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా తీసుకుంటున్న చర్యల ఫలితాలు మూడేళ్లలో కనిపించాలని నిర్దేశించారు. కాలుష్య నియంత్రణ మండలిలో అవినీతి కనిపించకూడదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి