S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/16/2020 - 06:29

విశాఖపట్నం, మార్చి 15: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచక్షణాధికారాన్ని ఉపయోగించడం చూస్తే శాసన మండలిలో చోటుచేసుకున్న సంఘటనే పునరావృతం అవుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

03/16/2020 - 06:15

విజయవాడ, మార్చి 15: కరోనా (కోవిడ్-19) వైరస్‌కు సంబంధించి టెస్టింగ్ ల్యాబ్‌ను విజయవాడలో ప్రారంభించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి ఒక బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకూ వైరస్ అనుమానితులు 70మందికి పరీక్షలు నిర్వహించగా 57మందికి నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. ఒకరికి పాజిటివ్ రాగా, మరో 12మంది ఫలితాలు రావాల్సి ఉంది.

03/16/2020 - 06:41

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తేనే కరోనా లాంటి వ్యాధులను అరికట్టటం సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 9నెలల కాలంలో ఆదివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తొలిసారి ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో మీడియా సమావేశం బాధాకరంగా ఉందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు చింతించాల్సి వస్తోందన్నారు.

03/16/2020 - 06:40

విజయవాడ: రాష్ట్రంలో వివిధ రకాల పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు (పీఎస్‌పీ)లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నదులు వంటి జలవనరులు అందుబాటులో ఉన్నచోట్ల ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదించింది.

03/16/2020 - 04:18

అమరావతి, మార్చి 15: పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడే ఐఎస్‌ఓ - 50001: 2018 ఇంధన ప్రమాణాలు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. ఈ నూతన ప్రమాణాల అమలుతో పరిశ్రమల్లో విద్యుత్ వినియోగ సమర్థత పెరగటంతో పాటు వృథాను నియంత్రించటం, అంతిమంగా సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

03/16/2020 - 04:12

అమరావతి, మార్చి 15: కరోనా వైరస్ సాకుతో రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలను వాయిదా వేయటం దారుణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు నిలిపివేస్తే కరోనా ఆగుతుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/16/2020 - 04:08

విజయవాడ, మార్చి 15: కరోనా వైరస్ వ్యాపిస్తోందనే కారణంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 21న జరగాల్సి ఉండగా 19న సాయంత్రానికి ప్రచారం ముగియాల్సి ఉంది.

03/15/2020 - 06:18

రాజంపేట, మార్చి 14: కరోనా బూచితో అనాదిగా కొనసాగుతున్న ఆచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిలోదకాలు ఇవ్వడం శ్రీరాముడి భక్తులను కలచివేస్తోంది. మర్యాద పురోషోత్తముడు సీతారాముడు నడిచిన నేల కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి ఏటా పౌర్ణమి నాటి రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

03/15/2020 - 06:17

గుంటూరు, మార్చి 14: రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యథేచ్ఛగా కొనసాగుతోందని, పోలీసులే టెర్రరిజానికి పాల్పడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను ఎన్ని విధాలుగా అడ్డుకోవాలో అన్ని విధాలుగానూ అడ్డుకుంటున్నారన్నారు.

03/15/2020 - 06:15

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక ఎన్నికలు అధికార పార్టీ కుట్రపూరిత ప్రహసనం మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ధ్వజమెత్తారు. ఆంధ్రరత్నభవన్‌లో శనివారం కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది.

Pages