ఆంధ్రప్రదేశ్
పవర్ ప్రాజెక్టులపై సర్కారు దృష్టి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ: రాష్ట్రంలో వివిధ రకాల పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు (పీఎస్‌పీ)లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నదులు వంటి జలవనరులు అందుబాటులో ఉన్నచోట్ల ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదించింది. అందుబాటులో ఉన్న జలవనరులను పంపింగ్ ద్వారా ఎత్తయిన ప్రాంతాలకు తరలించి, అక్కడ నుంచి నీటిని కిందికి పంపే సమయంలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని పీఎస్పీలుగా వ్యవహరిస్తారు. ఈ తరహా ప్రాజెక్టుల్లో పంపింగ్‌కు ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగించాల్సి వచ్చినప్పటికీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ విద్యుత్‌ను ఉపయోగించుకోవడం లాభసాటిగానే ఉంటుందని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఈ తరహా ప్రాజెక్టులను 30చోట్ల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రతిపాదించింది. నదీ తీరప్రాంతాల్లో 26చోట్ల, నదుల్లో 4చోట్ల నిర్మించే వీలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక, లాభనష్టాలను అధ్యయనం చేసేందుకు రెండు సంస్థలకు బాధ్యతలను అప్పగించింది. ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే, 33,240 మెగావాట్ల మేర విద్యుత్ రాష్ట్ర గ్రిడ్‌కు కలుస్తుందని అంచనా.