ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ కుట్రపూరిత రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక ఎన్నికలు అధికార పార్టీ కుట్రపూరిత ప్రహసనం మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ధ్వజమెత్తారు. ఆంధ్రరత్నభవన్‌లో శనివారం కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. అనంతరం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను సాక్ష్యాలతో ఈసీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రస్తుత ఎన్నికల్ని రద్దు చేసి తగిన సమయమిచ్చి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ధ్వంసమైతే వ్యవస్థలన్నీ దెబ్బతింటాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ పార్టీ కూడా నోరుమెదపడం లేదన్నారు. అధికార పార్టీ అరాచకాలపై రాజకీయ పార్టీలు, ఛానళ్లు, పత్రికలు కోడైకూస్తున్నా ఈసీలో చలనం లేదన్నారు. ఎన్నికల సమయంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఈసీ అధీనంలో ఉంటుందన్నారు. అయినా ఈసీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న వారిని అదుపు చేయలేకపోగా నిమ్మకునీరెత్తినట్లు ఉందన్నారు. పులివెందుల నియోజకర్గం చక్రాయిపేటలోని కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి కనిపించడం లేదన్నారు. మాచర్లలో హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు స్టేషన్ బెయిల్‌తో వచ్చి నామినేషన్ వేశాడన్నారు. ఈ విషయాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని శైలజానాధ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ గంగాధర్, గురునాధం, నరహరశెట్టి నరసింహారావు, రాజీవ్త్రన్, శేషు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్