S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/12/2020 - 06:38

గుంటూరు, మార్చి 11: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు.

03/12/2020 - 06:36

గుంటూరు, మార్చి 11: రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తల అరాచకాలు, దాడులు శృతిమించుతున్నాయని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా, లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/12/2020 - 06:12

నెల్లూరు: నెల్లూరులో ఒక యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ సహా వైద్యాధికారులు ఎవరు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదైందనే సమాచారం బుధవారం ఉదయం నుండి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు జిల్లా వాసులకు నిద్రపట్టనివ్వడం లేదు.

03/12/2020 - 06:11

గుంటూరు, మార్చి 11: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీసు, డైరెక్టరేట్ ఆప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పర్యవేక్షణలో ఆపరేషన్ సురా (కో-ఆర్డినేటింగ్ క్లస్టర్ రైడ్స్) కింద రాష్టవ్య్రాప్తంగా పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం 5 గంటల నుండి సుమారు 10 వేల మంది సిబ్బందితో దాడులు నిర్వహించారు.

03/12/2020 - 06:10

విశాఖపట్నం, మార్చి 11: ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య విభజన రేఖ చెదిరిపోతోందని, ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని పీసీసీ ఛీఫ్ శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

03/12/2020 - 06:10

విజయవాడ, మార్చి 11: ఏపీజెన్‌కో సీఎండీగా జీ. సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీసీఎల్ సీఎండీగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏపీజెన్‌కో సీఎండీగా ఇప్పటి వరకూ వ్యవహరిస్తున్న నాగులాపల్లి శ్రీకాంత్ స్థానంలో ఆయన్ని నియమించింది.
రూ. 21.66 కోట్లతో ఆరోగ్యశ్రీ కార్డుల ముద్రణ

03/12/2020 - 06:09

విజయవాడ, మార్చి 11: రాష్ట్రంలో వివిధ ఎంపీటీసీ స్థానాలకు ఒకే రోజు 3700 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో 9947 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 4535 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 3700 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. 652 జడ్పీటీసీ స్థానాలకు 422 నామినేషన్లు దాఖలు కాగా, మంగళవారం 354 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
పోస్టల్ బ్యాలెట్‌కు 14 వరకూ దరఖాస్తు గడువు

03/12/2020 - 06:08

విజయవాడ, మార్చి 11: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇది వర్తిసుంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకూ పాఠశాలలు పని చేస్తాయి.

03/12/2020 - 01:15

మాచర్ల రూరల్, మార్చి 11: తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై బుధవారం గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో దాడి జరిగింది.

03/12/2020 - 01:04

అమరావతి, మార్చి 11: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు నలుగురు వైసీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నలుగురికి బీ ఫారాలు అందజేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు శాసనసభకు చేరుకున్నారు.

Pages