S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/11/2020 - 01:27

విశాఖపట్నం: ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అవకాశవాద, అవినీతి రాజకీయాలపై కమలదళం, జనసైనికుల ఉమ్మడి పోరు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆరంభం కానుందని ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వెల్లడించారు.

03/11/2020 - 01:25

ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీకి భారీ షాక్ తగిలింది. సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు టీడీపీని వీడారు. అమరావతిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి భారీ కుదుపు తగిలిందనే చెప్పవచ్చు.

03/11/2020 - 01:24

అమరావతి, మార్చి 10: వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వా నీ, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపా రు.

03/11/2020 - 01:22

అమరావతి, మార్చి 10: పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు ఉండాలన్నారు. మూడు జతల యూనిఫారాలు, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, టెక్స్ట్ బుక్స్ కిట్‌లో ఉంటాయన్నారు. యూనిఫారాలు, బెల్ట్, బ్యాగ్‌ల నమూనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.

03/11/2020 - 01:16

విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సహకాలు అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగే

03/11/2020 - 01:15

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నియమించిన ఐఏఎస్ అధికారుల్లో ఐదుగురిని మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తాజాగా టీ. బాబూరావు నా యుడును కర్నూలుకు, లత్కర్ శ్రీకేష్‌ను కృష్ణా జిల్లాకు, హెచ్.అరుణకుమార్‌ను తూర్పు గోదావరి జిల్లాకు, పీఏ శోభను విజయనగరం జిల్లాకు, కే. హర్షవర్థన్‌ను అనంతపురం జిల్లాకు, సిద్ధార్థ జైన్‌ను చిత్తూ రు జిల్లాకు, బీ.

03/11/2020 - 01:15

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో 13 జిల్లాల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో తటస్థంగా మరియు నిష్పాక్షికంగా ఉండాలన్నారు. వెంటనే జిల్లాల్లో విధుల్లో చేరి బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

03/11/2020 - 01:47

వేంపల్లె: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి, శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కడప జిల్లా వేంపల్లెలోని స్వగృహంలో ముఖ్యఅనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

03/10/2020 - 05:32

అమరావతి, మార్చి 9: ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ను దూరం చేయవచ్చని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణకు వివిధ రాష్ట్రాలు చేపట్టిన చర్యలపై సోమవారం ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

03/10/2020 - 05:30

అమరావతి, మార్చి 9: రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో పెట్టుబడులకు జర్మనీ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా చెన్నైలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ కాన్సుల్ జనరల్ కేరిన్ స్టోల్ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా సీఎస్ వివరించారు.

Pages