ఆంధ్రప్రదేశ్‌

అవకాశవాద, అవినీతి రాజకీయాలపై కమలదళం-జన సైనికుల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అవకాశవాద, అవినీతి రాజకీయాలపై కమలదళం, జనసైనికుల ఉమ్మడి పోరు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆరంభం కానుందని ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వెల్లడించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఇరు పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ వైసీపీ, టీడీపీలు కుటుంబ, వ్యాపార ధోరణి రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఆరోపించారు. కుల తత్వంతోనే ఎన్నికలు సాగుతున్నాయన్నారు. టీడీపీ, వైసీపీల తీరుతో ప్రజలు విసిగిపోయారని, ఈ తరుణంలో జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని
నిర్ణయించడాన్ని ప్రజలు స్వాగతిస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో సింగిల్ ఫార్ములాతో ప్రజల ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ జనసేన, బీజేపీ పొత్తు చారిత్రాత్మక అవసరంగా భావించాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఆశిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తమ పొత్తు అద్భుత ఫలితాలను ఇస్తుందన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకే నంటూ వైసీపీ ప్రభుత్వం చిత్రమైన ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. గత ఎన్నికల్లో ఈ రెండింటితోనే అధికారంలోకి వచ్చిన జగన్, వాటితోనే విపక్షాలు భయపట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

*చిత్రం...సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ, జనసేన నాయకులు