ఆంధ్రప్రదేశ్‌

నాడు-నేడుపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు ఉండాలన్నారు. మూడు జతల యూనిఫారాలు, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, టెక్స్ట్ బుక్స్ కిట్‌లో ఉంటాయన్నారు. యూనిఫారాలు, బెల్ట్, బ్యాగ్‌ల నమూనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. పిల్లలకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యత ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీని సిద్ధం చేయాలన్నారు. నాడు- నేడు తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వచ్చే సమావేశం నాటికి పనులు ఏయే దశల్లో ఉన్నాయో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చేపట్టిన పనుల పరిస్థితి మెరుగ్గా ఉండాలన్నారు. జూన్ నాటికి పాఠశాలలు పున ప్రారంభం అవుతున్నందున అప్పటికి పనులు పెండింగ్‌లో ఉంచరాదన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. డిజిటల్ బోధన కోసం ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయాలన్నారు. గోరుముద్ద మధ్యాహ్న భోజనంపై యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా వీటీని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండ్ యాప్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాలపై నిశిత పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. నీళ్లులేని చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని అధికారులు చెప్పారు. నాడు- నేడు ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం సూచించారు. స్కూళ్లలో నాడు- నేడుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
*చిత్రం...విద్యార్థులకు పంపిణీ చేయనున్న బ్యాగులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి