ఆంధ్రప్రదేశ్‌

ప్రాథమిక రంగానికి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో పెట్టుబడులకు జర్మనీ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా చెన్నైలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ కాన్సుల్ జనరల్ కేరిన్ స్టోల్ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా సీఎస్ వివరించారు. ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులతో పాటు ఉపాథి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో వివిధ కంపెనీలను స్టోల్ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లోని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మన్ గౌరవ కాన్సుల్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... సీఎస్ నీలం సాహ్నితో సమావేశమైన జర్మన్ కాన్సుల్ జనరల్ కేరిన్ స్టోల్