S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/08/2020 - 05:17

విజయవాడ, మార్చి 7: రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

03/08/2020 - 01:47

విజయనగరం, మార్చి 7: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా కొనసాగుతున్న తనకు నోటీసు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి జీవో జారీ చేసి ఆ పదవిలో సంచయిత గజపతిరాజును నియమించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. దీనిపై న్యాయపోరాట చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శనివారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/08/2020 - 02:08

గుంటూరు: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం నాటికి 81వ రోజుకు చేరింది.

03/08/2020 - 01:43

విజయవాడ, మార్చి 7: అక్రమ రవాణాకు గురైన బాధితులను సమాజంతోపాటు ప్రభుత్వాలు కూడా మహిళలుగా గుర్తించడం లేదని వారికి బాధితులుగా అందవలసిన హక్కులు కూడా వారికి అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అక్రమ రవాణా బాధిత మహిళల ఫోరం ‘విముక్తి’ రాష్ట్ర కన్వీనర్ హసీనా ఆవేదన వెలిబుచ్చుతూ తమ ఆవేదనను అన్ని రాజకీయ పార్టీల మహిళా సంఘాల ప్రతినిధులు అర్థం చేసుకుని తమకు మద్దతు ఇవ్వాలని వేడుకున్నారు.

03/08/2020 - 01:42

గుంటూరు, మార్చి 7: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరుకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో ప్రభుత్వ శాఖల్లో పరిపాలనా భాష అమలుపై అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.

03/08/2020 - 01:41

విజయవాడ(సిటీ), మార్చి 7: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో భాగంగా శనివారం అధికారులు ఇంగ్లీష్ - 2 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం అధికారులు 3వ నెంబర్ ప్రశ్నపత్రాల సెట్‌ను ఎంపిక చేశారు. మొత్తం 46,9425 మంది విద్యార్థులు శనివారం పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 11, 983 మంది గైర్హాజరయ్యారు.

03/08/2020 - 01:40

విజయవాడ(సిటీ), మార్చి 7: సిగ్గు, శరం లేని మనిషి రాష్ట్రంలో ఒకరు ఉన్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఆయనే కోర్టులో కేసులు వేయించి, జీవోలను కొట్టి వేయించారని శనివారం ట్విట్టర్‌లో ఆరోపించారు. ఇప్పుడేమో బీసీలను రెచ్చగొట్టే విధంగా వారిన ఉసిగొల్పుతున్నారన్నారు.

03/08/2020 - 01:39

విజయనగరం, మార్చి 7: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరో 25 ఏళ్ళపాటు అధికారంలో ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలను గెలిపించుకోవాలని ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌చార్జి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ జగన్నాథ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

03/08/2020 - 01:38

గోపాలపురం, మార్చి 7: విషపూరితమైన గాలిని పీల్చి 28మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో వారికి వైద్య సేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

03/08/2020 - 01:36

తిరుపతి, మార్చి 7: పాత పెన్షన్ విధానానే్న తీసుకువచ్చి ఉద్యోగుల ఉన్నతికి సహకరించాలని ఏపీ ఎన్‌జీ ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్వీయూ సెనెట్ హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

Pages