ఆంధ్రప్రదేశ్‌

పాత పెన్షన్ విధానానే్న తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 7: పాత పెన్షన్ విధానానే్న తీసుకువచ్చి ఉద్యోగుల ఉన్నతికి సహకరించాలని ఏపీ ఎన్‌జీ ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్వీయూ సెనెట్ హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 29రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తమ సంఘం జాతీయ స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధానంగా సీపీ ఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సీ పీ ఎస్ ను రద్దుచేస్తామని హామీ ఇచ్చామన్నారు. అలాగే టక్కర్ కమిటీ కూడా సీ పీ ఎస్ ను రద్దుచేయవచ్చని స్పష్టం చేసిందన్నారు. ప్రైవేటు సంస్థల్లో పెన్షన్ విధానం ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానం ఉండాలన్నారు. అలాకాకపోతే ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యత్యాసం ఉండదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన హామీని నిలబెట్టుకుంటారన్న విశ్వాసం తమకుందన్నారు. దేశవ్యాప్తంగా 95 మంది సభ్యులు హాజరయ్యారన్నారు. ఒక వెస్ట్‌బెంగాళ్‌లో మాత్రమే ఈ సీపీ ఎస్ విధానం కొనసాగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానమే కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 80లక్షల మంది ఉద్యోగులు సీపీ ఎస్ ను వ్యతిరేఖిస్తున్నామన్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. త్వరలో సీపీ ఎస్‌ను రద్దుచేసిన మొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.