S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/06/2020 - 06:26

విజయవాడ(సిటీ), మార్చి 5: శాసనమండలి రద్దుతో బీసీలకు తీరని అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఇస్తున్న చీకటి జీవోలతో స్థానిక సంస్థలలో బీసీలను పదవులకు దూరం చేస్తోందని టీడీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మండలి రద్దుతో వేలాది మంది బీసీల పదవులకు సీఎం జగన్ మంట పెట్టారని గురువారం ట్విట్టర్‌లో అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

03/06/2020 - 06:26

గుంటూరు, మార్చి 5: అమరావతి శ్మశానమని, అక్కడ గేదెలు, పందులు తిరుగుతున్నాయే తప్ప ఎవరూ నివాసం ఉండటం లేదని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు.

03/06/2020 - 06:24

విజయవాడ(సిటీ), మార్చి 5: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 4వ తేదీ నుండి ప్రారంభమైన పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ - 2 పరీక్ష నిర్వహించారు. ఇందుకోసం అధికారులు రెండోనెంబర్ ప్రశ్నపత్రం సెట్‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,69,203 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్న ద్వితీయ సంవత్సర పరీక్షల కోసం 1411 సెంటర్లను ఏర్పాటు చేశారు.

03/06/2020 - 06:23

గుంటూరు, మార్చి 5: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ రైతుభరోసా పథకం కింద మరో 10, 989 మందికి లబ్ధి చేకూరింది. స్పందన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులకు రూ.8,24,17,500ల మేర లబ్ధి చేకూర్చినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ పేర్కొన్నారు.

03/06/2020 - 06:23

రాజమహేంద్రవరం, మార్చి 5: ఉగాది నాడు ప్రభుత్వం నిర్ధేశిత లక్ష్యం మేరకు పంపిణీ చేయతలపెట్టిన ఇళ్ల స్ధలాలకు అనువైన ప్రైవేటు భూములను సత్వరం సేకరించడానికి కృషిచేయాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నీరబ్‌కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

03/06/2020 - 07:04

విజయవాడ: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు 204.75 కోట్ల రూపాయలతో ముందస్తు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 6352 ఆవాసాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదించింది. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ మంచినీటి సరఫరాపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.

03/06/2020 - 00:51

విజయవాడ, మార్చి 5: రాష్ట్రంలో మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ రవాణా ఉండకూదని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల స్వరూపాన్ని మార్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమ మద్యం తయారీ వంటివి ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీస్తాయన్నారు.

03/06/2020 - 00:45

విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించి 102 మంది ఇంటిలోనే వైద్య పరిశీలనలో ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని గుర్తు చేసింది. కరోనా ప్రభావిత దేశాల నుంచి 330 మంది ప్రయాణికులను పరీశీలనలో ఉంచామని, వీరిలో ఇళ్లవద్దే కొంతమంది పరిశీలనలో ఉన్నారని తెలిపింది.

03/06/2020 - 07:05

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్‌కుమార్ తెలిపారు.

03/05/2020 - 06:20

విజయవాడ(సిటీ), మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చిత్రపరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ విజ్ఞప్తి చేసింది. నూతనంగా ఏర్పాటయిన ఏపీలో చిత్రపరిశ్రమకు ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Pages