S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/10/2020 - 04:15

విజయవాడ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15 నగరపాలక సంస్థలకుగాను వార్డుల పునర్విభజనపై చెలరేగిన వివాదంతో కోర్టు ఆదేశాలకు లోబడి శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

03/09/2020 - 05:36

రాజమహేంద్రవరం, మార్చి 8: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం పనుల కార్యాచరణపై మళ్లీ కసరత్తు మొదలైంది. పనుల ప్రణాళిక మొదటికొచ్చిన నేపథ్యంలో నిర్ణీత గడువుగా ప్రకటిస్తున్న రెండేళ్ల వ్యవధిలో పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వర్షాకాలం లోపు కాఫర్ డ్యామ్ పనులు ముందుకు కదిలే పరిస్థితి కన్పించడంలేదు.

03/09/2020 - 05:35

తిరుపతి, మార్చి 8: దేశభద్రతకే ముప్పు కలిగించేలా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత రాజకీయాల కుట్రతో తీసుకొచ్చిన నల్లచట్టాలను వెనక్కు తీసుకునే వరకు దేశంలో సాగుతున్న ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు.

03/09/2020 - 05:33

విజయవాడ, మార్చి 8: రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే భూములు ఇచ్చామని, అమరావతి అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంత మహిళా రైతులతో విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం సదస్సు జరిగింది.

03/09/2020 - 05:30

అనకాపల్లిటౌన్, మార్చి 8: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం ఖాయమని ఎంపీ, ఉత్తరాంధ్ర జోన్ ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

03/09/2020 - 05:29

గౌహతి, మార్చి 8: భారత్‌లో 2006లో 37 శాతం ఉన్న మహిళా కార్మికశక్తి 2019 నాటికి 18 శాతానికి పడిపోయిందని ఆజాద్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు వెల్లడించింది.

03/09/2020 - 05:28

విజయవాడ, మార్చి 8: రాజ్యాంగ పరిరక్షణకు మహిళలు పోరాడాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ ఆయన మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్న తరుణంలో రాజకీయాల్లో కూడా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

03/09/2020 - 05:28

గుంటూరు, మార్చి 8: దిశ చట్టం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ప్రచారానికే పరిమితమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ 9నెలల పాలనలో 180 అత్యాచారాలు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

03/09/2020 - 00:32

గుంటూరు, మార్చి 8: 2020ని మహిళల భద్రతకు పునాది వేసిన సంవత్సరంగా మార్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తన కార్యాలయం నుండి రాష్టవ్య్రాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్ల సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళల భద్రత గురించి దిశానిర్దేశం చేశారు.

03/09/2020 - 00:29

గుంటూరు, మార్చి 8: రాష్ట్రంలో ప్రతి మహిళ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకునేలా, మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన 5కే వాక్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Pages