ఆంధ్రప్రదేశ్‌

మహిళా సాధికారతే మా ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 8: రాష్ట్రంలో ప్రతి మహిళ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకునేలా, మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన 5కే వాక్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన ప్రతి పథకాన్ని వారి ముంగిటకే తీసుకెళ్తోందని, దేశంలోనే ఈ విధానం సంచలనం కలిగిస్తోందని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక పోలీసు స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకుని పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని సుచరిత పిలుపిచ్చారు.
*చిత్రం... గుంటూరులో 5కే రన్‌ను ప్రారంభించి మాట్లాడుతున్న హోం మంత్రి సుచరిత