ఆంధ్రప్రదేశ్‌

త్వరలో విశాఖ నుంచే జగన్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, మార్చి 8: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం ఖాయమని ఎంపీ, ఉత్తరాంధ్ర జోన్ ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
త్వరలోనే విశాఖ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. స్థానిక రావుగోపాలరావు క్షేత్రంలో ఆదివారం ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించారు. రాజధానిగా పనులు ప్రారంభించి హైదరాబాద్‌కు మించి విశాఖను సమగ్రంగా పురోభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో జగన్ ఉన్నారన్నారు. స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతు అయ్యే దిశగా వైసీపీ క్యాడర్ పనిచేయాలని రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజలవద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు వైసీపీ నాయకులకే ఉందన్నారు. డబ్బు,మద్యంకు స్వస్తిపలికి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు అడగండని ఆయన చెప్పారు.
ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా తీసుకురావడం ఖాయమన్నారు. విశాఖ రాజధానికి వ్యితిరేకించిన వారు ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు. విశాఖలో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్దిచెప్పారన్నారు.
సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎంపీలు గొట్టెటి మాధవి, బివి సత్యవతి, ప్రభుత్వవిప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్, కన్నబాబురాజు, గొల్లబాబురావు, భాగ్యలక్ష్మీ, విశాఖడెయిరీ సిఇఓ ఆడారి ఆనంద్, సెంట్రల్‌బ్యాంక్ చైర్మన్ సుకుమార్‌వర్మ, పార్లమెంట్ ఎన్నికల పరిశీలికులు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.