ఆంధ్రప్రదేశ్‌

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 8: 2020ని మహిళల భద్రతకు పునాది వేసిన సంవత్సరంగా మార్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తన కార్యాలయం నుండి రాష్టవ్య్రాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్ల సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళల భద్రత గురించి దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేందుకే దిశ మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మహిళామిత్రలు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రతి మహిళ నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితిని పోలీసు శాఖ కల్పించాలని
సిబ్బందికి సూచించారు. పోలీసు స్టేషన్‌కు రావాలంటే భయపడే రోజులు పోయాయని, నిర్భయంగా వచ్చి తమకు జరిగిన అన్యాయాలు చెప్పుకోవాలని, ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రి చేపట్టిన దిశ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా 18 దిశ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని, దిశ చట్టం ప్రత్యేకాధికారిగా దీపికా పాటిల్ వ్యవహరిస్తారని, దిశ యాప్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. దిశ యాప్‌తో రాష్టవ్య్రాప్తంగా ఈవ్‌టీజింగ్ బెడద తగ్గిందని, ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రక నిర్ణయం దిశతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సమాయాత్తమయ్యామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు అర్బన్ జిల్లాను కమిషనరేట్‌గా మార్చేందుకు ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకుంటామని డీజీపీ సవాంగ్ వివరించారు.

*చిత్రం... సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్