ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగ పరిరక్షణకు మహిళలు పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: రాజ్యాంగ పరిరక్షణకు మహిళలు పోరాడాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ ఆయన మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్న తరుణంలో రాజకీయాల్లో కూడా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక మహిళగా, పార్టీ అధినేతగా పార్టీలో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కల్పించిందని గుర్తుచేశారు. రాజ్యాంగం అపహాస్యం పాలవుతున్న వేళ, సామాన్య పౌరుడు హక్కులను కోల్పోతున్న సందర్భంలో రాజ్యాంగ పరిరక్షణకు మహిళలు కూడా పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలు రానున్న ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని శైలజానాథ్ సూచించారు.