ఆంధ్రప్రదేశ్‌

18 శాతానికి పడిపోయిన మహిళా కార్మికశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 8: భారత్‌లో 2006లో 37 శాతం ఉన్న మహిళా కార్మికశక్తి 2019 నాటికి 18 శాతానికి పడిపోయిందని ఆజాద్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనడం, అవకాశాలపై రూపొందించిన ఈ సంవత్సర గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో 153 దేశాలలో భారత్ 149వ స్థానంలో నిలిచిందని ఆజాద్ ఫౌండేషన్ పేర్కొంది. లింగ సమానత్వాన్ని సాధించేందుకు అవసరమయిన వౌలికసౌకర్యాలను సృష్టించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆ సంస్థ కోరింది. భారత్‌లో కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగితే, దానివల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా పెరుగుతుందని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ పేర్కొందని ఆజాద్ ఫౌండేషన్ వెల్లడించింది. ‘్భరత్‌లో లింగ సమానత్వం, మహిళా సాధికారికత లక్ష్యాలను సాధించడానికి తగ్గుతున్న మహిళా కార్మిక శక్తి, చెల్లింపుల్లో లింగపరమయిన అసమానత్వం (23 శాతం), కొరవడిన సామాజిక భద్రత అవరోధాలుగా కనపడుతున్నాయి’ అని ఆజాద్ ఫౌండేషన్ ఆదివారం నాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కార్మిక శక్తిలో మహిళలు ప్రవేశించడాన్ని, కొనసాగడాన్ని అడ్డుకుంటున్న వాటిలో వౌలిక సౌకర్యాలు, నియమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆజాద్ ఫౌండేషన్ విశ్వసిస్తోంది. ‘మహిళల అవసరాలకు అనుగుణంగా వౌలిక సౌకర్యాలను సృష్టించడంపై దృష్టి కేంద్రీకరించాలని మేము ప్రధాన మంత్రికి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశాం’ అని ఆజాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీను వదేరా పేర్కొన్నారు. మహిళల అవసరాలకు తగిన వౌలిక సౌకర్యాలలో పిల్లల కోసం పూర్తి సమయం పనిచేసే క్రెచ్‌లు, భరించగలిగే స్థాయిలో సురక్షితమయిన మహిళా హాస్టళ్లు, పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా వంటివి ఉన్నాయని ఆమె వివరించారు.