S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/09/2020 - 00:26

విశాఖపట్నం: పాలనా రాజధానిగా అవతరిస్తున్న విశాఖ నగరంలో మేయర్ పీఠాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుచుకోవాల్సిందేనని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కార్యకర్తలకు స్పష్టం చేశారు. విశాఖ అర్బన్ పరిధిలో జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు.

03/09/2020 - 00:24

విజయవాడ, మార్చి 8: రాష్ట్రంలో వివిధ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో విలీనం చేసే ప్రతిపాదనలు సిద్ధమైన కారణంగా ఆయా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవద్దని కోరింది. దీంతో దాదాపు 170 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు.

03/09/2020 - 00:22

అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగింటి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందిననాడే దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు.

03/09/2020 - 00:20

అమరావతి, మార్చి 8: రాష్ట్రంలోని 16 నగరపాలక సంస్థలు, 103 మున్సిపాల్టీలకు ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించింది. నగరపాలక సంస్థల్లో మేయర్ పదవులకు సంబంధించి జనరల్ మహిళలకు-5, అన్ రిజర్వుడ్-3, ఎస్టీ జనరల్-1, ఎస్సీ జనరల్-1, బీసీ జనరల్-3, బీసీ మహిళకు-2 ఖరారు చేశారు.

,
03/08/2020 - 05:46

హిందూపురం, మార్చి 7: లేపాక్షి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో లేపాక్షి పురవీధుల్లో శోభాయాత్ర సాగింది. విజయనగర సామ్రాజ్య వైభవం, లేపాక్షి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

03/08/2020 - 05:43

కడప, మార్చి 7: భారతదేశాన్ని కుల మతాల పరంగా విభజిస్తూ, పౌరవ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశ కీర్తిని సర్వనాశనం చేసేందుకు మోదీ, అమిత్‌షా దుష్టపన్నాగం పన్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కాషాయ కూటములు దేశంలో అలజడులు సృష్టించి ఫాసిస్టు వ్యవస్థను సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

03/08/2020 - 05:41

గుంటూరు, మార్చి 7: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో బీసీల రిజర్వేషన్లు గణనీయంగా పడిపోయాయని, రానున్న కాలంలో బీసీల ద్రోహిగా జగన్ మిగిలిపోనున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో వ్యవస్థలన్నింటినీ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

03/08/2020 - 05:19

వేంపల్లె, మార్చి7: ఎన్నార్సీ, క్యాబ్, ఎన్నార్పీ విషయమంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో ఓమాట, గల్లీలో ఓమాట మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీకి మద్దతుగా, తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రాగానే ముస్లింలకు మద్దతుగా ఉంటానని ప్రకటింటిస్తున్నారన్నారు. ఇలా సీఎం ద్వందవైఖరి అవలంభిస్తున్నారన్నారు.

03/08/2020 - 05:18

గుంటూరు, మార్చి 7: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు నిరంతరం నిఘా పెట్టామని, బాధ్యులు ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చినప్పటి నుండి ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు డీజీపీ నేతృత్వంలో నిరంతరం నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.

03/08/2020 - 05:18

గుంటూరు, మార్చి 7: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుకు కేంద్రం పూర్తి సహకారం అందజేస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. గుంటూరులోని స్పైసస్ బోర్డులో మిర్చియార్డు అధికారులు, రైతులు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయంలో లాభాలు గడించాలంటే ఉద్యానవన పంటల సాగు తప్పనిసరి అన్నారు.

Pages