ఆంధ్రప్రదేశ్‌

రాజధాని ప్రాంతంలో ఎన్నికల్లేవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: రాష్ట్రంలో వివిధ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో విలీనం చేసే ప్రతిపాదనలు సిద్ధమైన కారణంగా ఆయా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవద్దని కోరింది. దీంతో దాదాపు 170 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో 7 పంచాయతీలను, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో 5 పంచాయతీలను, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 20 పంచాయతీలను, ఏలూరు నగరపాలక సంస్థలో 7 పంచాయతీలను విలీనం చేశారు. పాలకొల్లు మున్సిపాలిటీలో 5 పంచాయతీలను, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 5, గుడివాడ మున్సిపాలిటీలో 6, నరసరావుపేట మున్సిపాలిటీలో 5, చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3, బాపట్ల మున్సిపాలిటీలో 9, పొన్నూరు మున్సిపాలిటీలో 6, గూడూరు మున్సిపాలిటీలో 5, సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 2, నాయుడుపేట మున్సిపాలిటీలో 4, కావలి మున్సిపాలిటీలో 1, కర్నూలు మున్సిపాలిటీలో 3, నంద్యాల మున్సిపాలిటీలో 4, పుంగనూరు మున్సిపాలిటీలో 2, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 7 పంచాయతీలను విలీనం చేశారు. దీంతో దాదాపు 120 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. చింతలపూడి, తాడిగడప, పొదిలి,
అల్లూరులను కొత్త మున్సిపాలిటీలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. రాజధాని ప్రాంతంలోని 29 పంచాయతీల్లో కొన్నిటిని వివిధ మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండగా, కొన్ని పంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. నిడమర్రులోని కొంత భాగం, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ పంచాయతీలు సహా తుళ్లూరు మండలంలోని గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ జనాభా సంఖ్య దృష్ట్యా మున్సిపాలిటీకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో మొత్తంగా 170 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈవిషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పంచాయతీల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని కోరింది.