ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మేయర్ పీఠం గెలవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పాలనా రాజధానిగా అవతరిస్తున్న విశాఖ నగరంలో మేయర్ పీఠాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుచుకోవాల్సిందేనని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కార్యకర్తలకు స్పష్టం చేశారు. విశాఖ అర్బన్ పరిధిలో జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీ మేయర్ స్థానం గెలుచుకున్న సందర్భంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా విశాఖ మేయర్ స్థానాన్ని వైసీపీ గెలుచుకొని తీరాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో విజయం సాధించే దిశగా ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలను అయిదు జోన్లుగా విభజించారన్నారు. ఉత్తరాంధ్ర ఒక జోన్‌గా, ఉభయ గోదావరి జిల్లాలు మరో జోన్‌గా, కృష్ణా, గుంటూరు జిల్లాలు మూడో జోన్‌గా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు నాలుగో జోన్‌గా, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో అయిదో జోన్‌గా విభజించి సీనియర్ నేతలను ఇన్‌ఛార్జిలుగా నియమించారన్నారు. వీటితో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఇన్‌ఛార్జి నియమించారని, వీరికి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, సమన్వయకర్తలు కలిసి చర్చించిన మీదటే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అధినేత సొంతంగా నిర్విహించిన నివేదికల ఆధారంగా ఫ్లాష్ సర్వేలో ప్రజాభిమానం కలిగిన నాయకులే అభ్యర్థులు అవుతారన్నారు. తమ చుట్టూ తిరిగితేనో, పైరవీలు చేస్తేనే టిక్కెట్టు లభించదని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కష్టపడి, నమ్మకంగా పనిచేసినప్పటికీ కొన్ని కారణాల రీత్యా టిక్కెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి