ఆంధ్రప్రదేశ్‌

మోదీ, షా చేతిలో దేశం చిన్నాభిన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 7: భారతదేశాన్ని కుల మతాల పరంగా విభజిస్తూ, పౌరవ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశ కీర్తిని సర్వనాశనం చేసేందుకు మోదీ, అమిత్‌షా దుష్టపన్నాగం పన్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కాషాయ కూటములు దేశంలో అలజడులు సృష్టించి ఫాసిస్టు వ్యవస్థను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శనివారం భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసభకు హాజరైన సీతారాం ఏచూరి మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవస్థను మత కుల వ్యవస్థలుగా విభజిస్తూ అనేక చట్టాలు తెచ్చారన్నారు. ఈచట్టాలతో పౌరులను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దుచేసి అక్కడి నేతలు, ప్రజలను నిర్బంధించి కాశ్మీర్‌ను అతలాకుతలం చేశారని అన్నారు. ఇప్పుడు ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ వంటి చట్టాలను తెరమీదకు తెచ్చి, ముస్లిం, మైనార్టీ, బడుగు వర్గాలను దేశం నుండి తరిమివేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. క్రూరమైన ఈ చట్టాలను అడ్డంపెట్టుకుని రాష్ట్రాల్లో బీజేపీ వర్గవైషమ్యాలను సృష్టిస్తోందన్నారు. దీనివల్లే ఢిల్లీలో 50 మంది దుర్మరణం పాలయ్యారన్నారు. కాషాయ దళాల దుష్టపన్నాగాలను వామపక్షాలు అడ్డుకుంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయకుండా మోదీ, అమిత్‌షా వత్తిడికి లొంగిపోయారని ఆరోపించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రాజా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, దేశ ప్రజల ఐక్యతను కోరుకున్న మహాత్మాగాంధీ లాంటి మహానేతల ఆశయాలను బీజేపీ కాషాయదళం అపహాస్యం చేస్తోందని ఆక్షేపించారు. పౌరసత్వంపై మోదీ, అమిత్‌షాకు ఏం తెలుసో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఈచట్టాలకు వ్యతిరేకంగా యావత్ భారతదేశం రగులుతోందన్నారు. కేరళ రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాలు కేంద్రాన్ని ఎదిరించి తీర్మానాలు చేస్తుంటే, ఏపీలో మాత్రం జగన్మోహన్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. మైనార్టీలంటే ఒక్క ముస్లింలే కాదని, దేశంలో ఎన్నో వర్గాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాల వల్ల ఈ వర్గాలకు పౌరసత్వ ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ,దీంతో అన్ని వర్గాలు తెరమీదకు వచ్చాయన్నారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ మాట్లాడుతూ అన్ని వర్గాలు కేంద్ర ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయన్నారు.
*చిత్రం... కడప బహిరంగసభలో ప్రసంగిస్తున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి