ఆంధ్రప్రదేశ్‌

ఎన్సార్సీపై జగన్ ద్వందవైఖరి: శైలజానాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, మార్చి7: ఎన్నార్సీ, క్యాబ్, ఎన్నార్పీ విషయమంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో ఓమాట, గల్లీలో ఓమాట మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీకి మద్దతుగా, తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రాగానే ముస్లింలకు మద్దతుగా ఉంటానని ప్రకటింటిస్తున్నారన్నారు. ఇలా సీఎం ద్వందవైఖరి అవలంభిస్తున్నారన్నారు. కడప జిల్లా వేంపల్లెలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సీఏం వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారని, అభ్యర్థుల గెలుపోటముల బాధ్యత మంత్రులే వహించాలని తేల్చారని, దీనిలో ఉన్న ఆంతర్యమేమిటో సీఎం స్పష్టం చేయాలన్నారు. మద్యం, డబ్బు పంచడంలో ప్రతి ఎన్నికల్లో వైసీపీ వారే ముందంజలో ఉంటారన్నారు. అటువంటి వైసీపీ శ్రేణులపై ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా జరపాల్సిన అవసరం లేదన్నారు. మూడు మాసాల క్రితమే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండాల్సి ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. వేంపల్లెకు వచ్చిన శైలజానాథ్‌కు రు. ఎంహెచ్‌పీయస్ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మూలం రెడ్డి రామాంజనేయులు రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం, రవి తదితర కాంగ్రెస్ నాయకులు, ఎంహెచ్‌పియస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.