S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/10/2020 - 04:59

గుంటూరు, మార్చి 9: మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుండి ఉద్యమబాట పట్టిన రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, రైతు కూలీలు వరుసగా 83వ రోజు సోమవారం కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

03/10/2020 - 04:56

రాజమహేంద్రవరం, మార్చి 9: రాష్ట్రంలో వర్జినియా పొగాకు సాగు విస్తీర్ణం ఏటికేడాది తగ్గుతోంది. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్ ప్రధాన కారణమైతే, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం కూడా సాగు తగ్గడానికి కారణమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు పొగాకు వేలం కేంద్రం పరిధిని పరిశీలిస్తే..గత రెండు దశాబ్ధాల కాలంలో ఉత్పత్తి 30 లక్షల మిలియన్ కిలోల నుండి మూడు లక్షల మిలియన్ కిలోలకు పడిపోయింది.

03/10/2020 - 04:48

విజయవాడ(సిటీ), మార్చి 9: దేశంలో దివాళా కోరు రాజకీయాలు చేయడం ఒక్క చంద్రబాబునాయుడికే చెల్లిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని సోమవారం ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి ఆరోపించారు. రెండేళ్ల కిందట జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చంద్రబాబేనన్నారు.

03/10/2020 - 04:47

విజయవాడ(సిటీ), మార్చి 9: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో జరగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్యకార్యదర్శి బీ రాజశేఖర్ పరిశీలించారు. విజయవాడలోని లయోలా కళాశాలలో సోమవారం జరుగుతున్న మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ తీరును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.

03/10/2020 - 04:44

విజయవాడ(సిటీ), మార్చి 9: ఉమ్మడి ఏపీతో పాటు ఇప్పటి నవ్యాంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం చేసిన పార్టీ ఒక్క టీడీపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని సోమవారం ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే ఏపీలో సామాజిక న్యాయం వెల్లివిరిసిందన్నారు.

03/10/2020 - 04:43

అమరావతి, మార్చి 9: కోవిడ్-19 (కరోనా వైరస్) విషయంలో ఆందోళన వద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ బులిటెన్ విడుదల చేసింది. వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో నోడల్ అధికారులుగా కలెక్టర్లను నియమించారు. లైన్ డిపార్ట్‌మెంట్‌లోని నోడల్ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

03/10/2020 - 01:22

అమరావతి, మార్చి 9: రాజ్యసభ అభ్యర్థులుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు, జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న పరిమళ్ నత్వానీతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ నేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్లను సోమవారం పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.

03/10/2020 - 01:14

అమరావతి: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్, ఆయన భార్య షిరీన్ రెహమాన్ తమ అనుచరులతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

03/10/2020 - 01:09

అమరావతి, మార్చి 9: ఉన్నత విద్యలో ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన తప్పనిసరన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కళాశాలల ఫీజులపై ప్రతిపాదనలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముందుంచింది.

03/10/2020 - 01:06

అమరావతి, మార్చి 9: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఈ విషయంలో ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 13 జిల్లాలకు నియమించిన పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Pages