ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 9: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో జరగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్యకార్యదర్శి బీ రాజశేఖర్ పరిశీలించారు. విజయవాడలోని లయోలా కళాశాలలో సోమవారం జరుగుతున్న మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ తీరును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ కార్యదర్శి వీ రామకృష్ణతో కలసి పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులకు అవసరమైన వౌలిక సదుపాయాల ఏర్పాటు తీరును పరిశీలించారు. తాగునీరు, టాయిలెట్స్, వెలుతురు వంటి అంశాలను తనిఖీ చేశారు. అలాగే జంబ్లీంగ్ విధానం అమలు జరిగిన తీరు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పని చేస్తున్న విధానం, హాల్ టికెట్స్‌లో క్యూఆర్ విధానం వంటివి పరిశీలించిన ఆయన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాఉంటే సోమవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు లెక్కల పేపర్ - 1, బోటనీ పేపర్ - 1, సివిక్స్ పేపర్ - 1 పరీక్షను అధికారులు నిర్వహించారు. ఇందుకోసం అధికారులు సెట్ నెంబర్ 2 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. 13 జిల్లాలో 1411 సెంటర్లను పరీక్షల కోసం అధికారులు ఏర్పాటు చేయగా సోమవారం పరీక్షకు మొత్తం 24,490 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక రాష్ట్రంలోని వివిద పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడుతున్న 10 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.