ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.లో తగ్గుతున్న వర్జీనియా సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 9: రాష్ట్రంలో వర్జినియా పొగాకు సాగు విస్తీర్ణం ఏటికేడాది తగ్గుతోంది. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్ ప్రధాన కారణమైతే, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం కూడా సాగు తగ్గడానికి కారణమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు పొగాకు వేలం కేంద్రం పరిధిని పరిశీలిస్తే..గత రెండు దశాబ్ధాల కాలంలో ఉత్పత్తి 30 లక్షల మిలియన్ కిలోల నుండి మూడు లక్షల మిలియన్ కిలోలకు పడిపోయింది. సీజను ఆరంభంలో సాగు చేయడానికి రైతులు బోర్డు నుండి అనుమతి తీసుకుంటున్నప్పటికీ, తదనంతర పరిణామాల్లో సాగు చేయడంలేదని తెలియజేస్తూ విరమించుకుంటున్నారు. వర్జీనియా పొగాకు 2009-10 సంవత్సరంలో 69 గ్రామాల విస్తీర్ణంలో 1433 మంది రైతులు 1608 బ్యారన్ల పొగాకు పండించడానికి రిజిస్టర్ చేసుకున్నారు. 3206 హెక్టార్ల విస్తీర్ణంలో 6.04 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ జరిగింది. సరాసరిగా కిలోకు రూ.54.77 ధర లభించింది. అత్యధిక ధర రూ.140 వచ్చింది. మొత్తంగా రూ.33.12 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. అదే 2014-15 సంవత్సరానికొచ్చే సరికి వర్జీనియా పండించే గ్రామాలు 41కి పడిపోయాయి. కేవలం 1413 మంది రైతులు 1518 బ్యారన్లకు 2885.15 హెక్టార్ల విస్తీర్ణంలో పంటను సాగు చేసేందుకు రిజిస్టర్ చేసుకోగా రూ.41.68 కోట్ల వ్యాపారం సాగింది. గత ఏడాది అంటే 2018-19లో కేవలం 41 గ్రామాల్లో 1371 మంది రైతులు 1464.67 బ్యారన్లకు 1757.64 హెక్టార్ల పరిధిలో సాగుకు రిజిస్టర్ చేసుకోగా 1496.90 హెక్టార్లలోనే సాగు జరిగింది. 3.81 మిలియన్ కిలోల దిగుబడి అంచనావేయగా అందులో 2.48 మిలియన్ కిలోల విక్రయాలు జరిగాయి. సరాసరి ధర కిలోకు రూ.123.24 లభించింది. అత్యధిక ధర కిలోకు రూ.187, అత్యల్ప రూ.20 లభించింది. రూ.30 కోట్ల 65 లక్షల అంచనా విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏటికేడాది పొగాకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి కేంద్ర పొగాకు బోర్డు వర్జినియా పొగాకు వేలం కేంద్రం తొర్రేడులో ఏప్రిల్ 8వ తేదీ నుంచి వేలం ప్రక్రియ నిర్వహించాలని ప్రకటించింది. 2019-20 సంవత్సరాలకు సంబంధించి 1369 మంది రైతులు 1339 బ్యారన్లకు 4345 ఎకరాల్లో (1738 హెక్టార్లు)లో 37 లక్షల 68 వేల 284 కేజీల పొగాకు పండించేందుకు అనుమతి తీసుకోగా అందులో 258 మంది రైతులు అంటే 670 ఎకరాల్లో పొగాకు వేయడం మానుకున్నట్టు బోర్డుకు తెలియజేశారు. ఈ మేరకు ఈ ఏడాది 1111 మంది రైతులు 3542 ఎకరాల్లో వర్జినియా పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది 30 లక్షల కిలోల వరకు దిగుబడి వస్తుందని అంచనావేశారు. ఈ సీజనుకు సంబంధించి ఏప్రిల్ 8 నుంచి వేలం ప్రారంభం కానుంది. గతంలో రష్యా, చైనాలకు పొగాకు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. గత కొంత కాలంగా ఆ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో ఆ ప్రభావం సాగుపై పడింది. వాస్తవానికి తొర్రేడు వేలం కేంద్రంతో పాటు నల్లరేగడి నేలల్లో పండించే వర్జినియాకు సంబంధించి రంగంపేట, కాపవరం వేలం కేంద్రాలు కూడా ఉండేవివి. ఇపుడు సాగు తగ్గిపోవడం వల్ల కేవలం తొర్రేడు వేలం కేంద్రానికే సాగు విస్తీర్ణం పరిమితమైంది.