ఆంధ్రప్రదేశ్‌

దివాలా కోరు రాజకీయాలు బాబుకే చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 9: దేశంలో దివాళా కోరు రాజకీయాలు చేయడం ఒక్క చంద్రబాబునాయుడికే చెల్లిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని సోమవారం ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి ఆరోపించారు. రెండేళ్ల కిందట జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చంద్రబాబేనన్నారు. ఇది చాలక ఇప్పుడు ఇంత హడావుడి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకపోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారన్నారు. దివాళాకోరు రాజకీయాలెందుకు చంద్రబాబూ అని నిలదీశారు. నీ వల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు.