ఆంధ్రప్రదేశ్‌

సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 9: ఉమ్మడి ఏపీతో పాటు ఇప్పటి నవ్యాంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం చేసిన పార్టీ ఒక్క టీడీపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని సోమవారం ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే ఏపీలో సామాజిక న్యాయం వెల్లివిరిసిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇవ్వడమే కాకుండా, బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనన్నారు. బీసీలకు తొలుత 27 శాతం, తరువాత 1995లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారి రాజకీయ సాధికారతకు నాంది పలికామన్నారు. సమాజంలో పెత్తందారీ పోకడలకు అడ్డుకట్ట వేశామన్నారు. 33 ఏళ్ళుగా బీసీలు పొందుతున్న పదవులకు కోతపెట్టి, మళ్ళీ పెత్తందారీ రాజ్యాన్ని తెచ్చే లక్ష్యంతోనే 34శాతం బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. కొన్ని జిల్లాలలో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణమన్నారు. జడ్పీటీసీ స్థానాల్లో నెల్లూరులో 13 శాతం, ప్రకాశంలో 19.64 శాతం, పశ్చిమగోదావరిలో 18.75 శాతం, కృష్ణాలో 20.41 శాతం, తూర్పుగోదావరిలో 20.97 శాతం, విశాఖలో 20.51 శాతానికి బీసీలను పరిమితం చేశారన్నారు. చట్టసభల్లో, ప్రభుత్వ విభానాల్లో బీసీల భాగస్వామ్యాన్ని దూరం చేసే కుట్ర జరిగిందన్నారు.