ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ వైసీపీ అభ్యర్థుల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: రాజ్యసభ అభ్యర్థులుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు, జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న పరిమళ్ నత్వానీతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ నేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్లను సోమవారం పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న టీ సుబ్బరామిరెడ్డి, ఆలీఖాన్, కే కేశవరావు, తోట సీతారామలక్ష్మి పదవీ కాలం పూర్తి కావటంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఈనెల 6న నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 13వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికలు అనివార్యమైతే ఈనెల 26న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి కృష్ణమాచారి ప్రకటించారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నందున నాలుగు సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో నత్వానీ రిలయన్స్ గ్రూపుల భాగస్వామిగా ఉన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి రిలయన్స్ అధినేత
ముఖేష్ అంబానీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన హామీ ఇవ్వటంతో ఆయనకు ప్రాతినిధ్యం కల్పించారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడిగానే ఆయన కొనసాగుతారని శాసనమండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో మండలి నుంచి మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. మండలి రద్దయ్యేంత వరకు మంత్రులుగా వారు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక రాంకీ గ్రూప్‌ల అధినేత, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల అయోథ్య రామిరెడ్డికి ఈ సారి రాజ్యసభకు అవకాశం దక్కింది. ఇప్పటి వరకు ఆయన ఏ పదవినీ ఆశించలేదు. స్వయంగా సీఎం జగన్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త టీ సుబ్బరామిరెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుబ్బరామిరెడ్డి పదవీ కాలం వచ్చే నెల 9వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన ఆశించి జగన్‌తో సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ చివరి క్షణంలో ఏవైనా మార్పులు, చేర్పులు జరగవచ్చనే ఊహాగానాలు పార్టీ వర్గాల నుంచి వినవస్తున్నాయి.

*చిత్రాలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్ *మోపిదేవి వెంకటరమణ
*అయోధ్యరామిరెడ్డి *పరిమళ్ నత్వానీ