ఆంధ్రప్రదేశ్‌

మహిళల మహా ప్రదర్శనలతో హోరెత్తిన రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 9: మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుండి ఉద్యమబాట పట్టిన రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, రైతు కూలీలు వరుసగా 83వ రోజు సోమవారం కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. సోమవారం హోలీ పండుగను పురస్కరించుకుని ఆనందంగా గడపాల్సిన రైతులు, ప్రజలు తమ జీవితాల్లో అంధకారం నింపేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖాలకు నల్లరంగు పూసుకుని నిరసన వ్యక్తంచేశారు. అలాగే పలు గ్రామాల్లో పసుపు, కుంకుమలతో పంగనామాలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు మందడంలో మహాధర్నా నిర్వహించగా వెలగపూడి, ఉండవల్లి, రాయపూడి, పెనుమాక, నిడమర్రు, నవులూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో, గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలను కొనసాగించారు. సోమవారం దీక్షా శిబిరాల వద్ద మహిళలు వందలాదిగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఆకుపచ్చటి జెండాలను చేతబూని సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదాలతో మహిళలు హోరెత్తించారు. మందడంలో దాదాపు 30 మందికి పైగా మహిళలు 12 గంటల నిరసన దీక్షకు దిగగా, కృష్ణాయపాలెంలో మహిళలు, రైతులు 24 గంటల దీక్షకు పూనుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకూ ఈ ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మహిళలు అనే గౌరవం కూడా లేకుండా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పెనుమాకలో 80 గంటల దీక్ష చేస్తున్న రైతులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంఘీభావం తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 83 రోజులుగా మహిళలు, రైతులు, రైతు కూలీలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే రాష్ట్రాన్ని జగరోనా వైరస్ నాశనం చేస్తోందని విమర్శించారు. ఏనాడూ రాజధాని కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని ఊహించలేదని, అమరావతిలో ఏర్పడిన వనరులు, అవకాశాలను వైసీపీ నాశనం చేసిందని విమర్శించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని పెయిడ్ ఆర్టిస్ట్‌ల పేరుతో రైతులను అవమానిస్తున్నారని, రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అల్లర్లు చేయాలని కుట్ర చేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధాని కోసం దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోగా, 2,500 మంది రైతులపై కేసులు పెట్టారని, 500 మందిని అన్యాయంగా జైలుకు పంపారని విమర్శించారు.