ఆంధ్రప్రదేశ్‌

కోవిడ్-19తో ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: కోవిడ్-19 (కరోనా వైరస్) విషయంలో ఆందోళన వద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ బులిటెన్ విడుదల చేసింది. వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో నోడల్ అధికారులుగా కలెక్టర్లను నియమించారు. లైన్ డిపార్ట్‌మెంట్‌లోని నోడల్ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది. వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నెంబర్ 0866-2401978కు అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కోరింది. వైరస్ లక్షణాలు సోకితే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, 104 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 465 మంది ప్రయాణికులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 232 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలన జరుపుతున్నారు. 226 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 35 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 33 మందికి నెగటివ్‌గా తేలిందన్నారు. ఇద్దరి శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు ఇంకా అందవలసి ఉందన్నారు. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొవిడ్-19 అనుమానిత కేసుల విషయంలో జిల్లా వైద్యాధికారులు, రాపిడ్ రెస్పాన్స్ టీంలు మార్గదర్శకాలను విధిగా పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో సరిపోను మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.