S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/08/2020 - 01:02

విజయవాడ: రాష్ట్రంలోని వివిధ జిల్లా ప్రజా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌లు, నగర పాలక సంస్థల మేయర్ల ఎన్నికలను పరోక్ష ఎన్నికల విధానంలో నిర్వహించనున్నారు. జిల్లా ప్రజా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌లు, వైస్-చైర్‌పర్సన్‌లను, నగర పాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్‌లను పరోక్ష ఎన్నికల విధానంలో ఎన్నుకోనున్నారు.

03/08/2020 - 00:45

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో టెన్త్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను మా ర్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను 31 నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ 17 వరకూ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకూ పరీక్షలు జరుగుతాయి.

03/08/2020 - 00:36

విజయవాడ, మార్చి 7: ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు నిఘా యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. సామాన్యులు సైతం ఎన్నికల్లో జరిగే అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ యాప్‌ను రూపకల్పన చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిఘా యాప్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.

03/08/2020 - 00:34

విజయవాడ, మార్చి 7: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండో దశ లో మున్సిపల్ ఎన్నికలు, మూడోదశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలను మాత్రం రెండు విడతలుగా నిర్వహించనున్నారు.

03/06/2020 - 06:52

గుంటూరు, మార్చి 5: రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ పేదల మధ్య ప్రభుత్వం విద్వేషాలను పెంచుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరినాథరెడ్డి గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

03/06/2020 - 06:52

గుంటూరు, మార్చి 5: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అనే నినాదంతో మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం గురువారం 79వ రోజుకు చేరింది.

03/06/2020 - 06:51

చింతలపూడి/పోలవరం, మార్చి 5: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ఏ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా కరోనా అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా లక్షణాలున్నాయని సందేహం వ్యక్తంచేస్తూ అధికార్లకు ఫిర్యాదుచేస్తున్నారు. అధికార్లు జరిపే పరిశీలనలో చివరకు ఏమీ లేదని తేలుతోంది.

03/06/2020 - 06:48

శ్రీశైలం టౌన్, మార్చి 5: శ్రీశైలం డ్యాం రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు తొమ్మిది మంది నిపుణులతో కూడిన బృందం గురువాం శ్రీశైలం చేరుకుంది. వ్యూ పాయింట్ వద్ద ఈ బృందం డ్యామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.

03/06/2020 - 06:47

విజయవాడ(సిటీ), మార్చి 5: అధికారంలోకి వచ్చిన నాటి నుండి పూర్తి రివర్స్‌లో పాలన చేస్తున్న సీఎం జగన్ ఆఖరికి బీసీ రిజర్వేషన్లలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఒకే ఒక్క నేత జగన్ మాత్రమేనంటూ గురువారం ట్విట్టర్‌లో లోకేష్ ఎద్దేవా చేశారు.

03/06/2020 - 06:29

విజయవాడ(సిటీ), మార్చి 5: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తప్పని సరిగా 34 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు జనసేన పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలను అణగదొక్కాలనే ప్రయత్నం జరుగుతోందని, గవర్నర్ కలుగజేసుకుని న్యాయం చేయాలన్నారు.

Pages